పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మరణాన్ని కార్డినల్ ఫారెల్ గారు అధికారికంగా ధృవీకరించారు.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మరణాన్ని కార్డినల్ ఫారెల్ గారు అధికారికంగా ధృవీకరించారు.
మంగళవారం, వాటికన్‌లోని కాసా శాంటా మార్టా ప్రార్థనా మందిరంలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి పార్థివ దేహాన్ని బహిరంగ శవపేటికలో ఉంచారు. ఫ్రాన్సిస్ పాపు గారి పార్థివ దేహం శవపేటికలో ఉంచే ఆచారానికి కార్డినల్ కామెర్లెంగో కెవిన్ ఫారెల్ అధ్యక్షత వహించారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మరణాన్ని కార్డినల్ ఫారెల్ గారు అధికారికంగా ధృవీకరించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో కార్డినల్ గియోవన్నీ బాటిస్టా రే మరియు దివంగత పోప్ ఫ్రాన్సిస్ కుటుంబ సభ్యులు, హెల్త్ అండ్ హైజీన్ డైరెక్టరేట్ డైరెక్టర్ మరియు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఆండ్రియా ఆర్కాంజెలి మరియు డాక్టర్ లుయిగి కార్బోన్ ఉన్నారు.
డాక్టర్ ఆండ్రియా ఆర్కాంజెలి గారు "ఫ్రాన్సిస్ పాపు గారు స్ట్రోక్‌తో బాధపడుతూ మరణించారని, .దానికి ముందు కోమాలోకి వెళ్ళారని తెలిపారు. దీనికి సంబంధించి
హోలీ సీ ప్రెస్ ఆఫీస్ సోమవారం సాయంత్రం నివేదికను విడుదల చేసింది.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer