నేషనల్ ఇటాలియన్ అమెరికన్ ఫౌండేషన్ సభ్యులతో సమావేశమైన పోప్

నేషనల్ ఇటాలియన్ అమెరికన్ ఫౌండేషన్ సభ్యులతో సమావేశమైన పోప్
బుధవారం జూన్ 4 ఉదయం వాటికన్లో పోప్ లియో XIV నేషనల్ ఇటాలియన్ అమెరికన్ ఫౌండేషన్ సభ్యులతో సమావేశమయ్యారు
ఈ ఫౌండేషన్ 50వ వార్షికోత్సవం సందర్భంగా సెయింట్ పీటర్స్ స్క్వేర్లో తన సాధారణ ప్రేక్షకుల సమావేశం ముందు ఆయన వారిని స్వీకరించారు.
Foundation's Board of Directors సభ్యులను ఆంగ్లంలో హృదయపూర్వకంగా స్వాగతించి, పోప్ తమ సేవను ప్రశంసించారు.
"ఇటలీ నుండి యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చిన చాలా మంది వ్యక్తుల లక్షణం వారి కథోలిక విశ్వాసం" అని పోప్ అన్నారు
ఇటాలియన్ సంస్కృతి మరియు చరిత్ర గురించి యువతకు అవగాహన కల్పించడానికి,
అలాగే రెండు దేశాలలో స్కాలర్షిప్లు మరియు ఇతర దాతృత్వ సహాయాన్ని అందించడానికి వారు చేసిన కృషికి పోప్ లియో వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇది "రెండు దేశాల మధ్య పరస్పరం ప్రయోజనకరమైన సంబంధాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది" అని పోప్ అన్నారు.