డిసెంబర్ 15న కోర్సికాను సందర్శించనున్న పొప్ ఫ్రాన్సిస్

అజాక్సియో మేత్రాసనం నిర్వహించనున్న ప్రముఖ మతపరమైన సంప్రదాయాలపై అంతర్జాతీయ ముగింపు సమావేశానికి డిసెంబరు 15 2024 న పొప్ ఫ్రాన్సిస్ గారు ఫ్రాన్స్‌లోని మధ్యధరా ప్రాంతంలో ద్వీపమైన కోర్సికాకు అపోస్టోలిక పర్యటనను చేయనున్నారు   

పోప్ ఫ్రాన్సిస్ గారు డిసెంబరు 15న ఫ్రెంచ్ ద్వీపం అయిన కోర్సికాకు వెళతారని, విదేశాల్లో తన 47వ అపోస్టోలిక్ పర్యటన మరియు ఫ్రెంచ్ మెడిటరేనియన్ ద్వీపానికి తొలిసారిగా సందర్శన చేస్తారని శనివారం నాడు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ డైరెక్టర్, మాటియో బ్రూనీ ప్రకటించారు. 

సైప్రస్ తర్వాత మధ్యధరా ప్రాంతంలో నాల్గవ-అతిపెద్ద ద్వీపం కోర్సికా, అయినప్పటికీ దాని జనాభాలో నాలుగవ వంతు మాత్రమే ఉంది.

చరిత్రలో ప్రముఖ వ్యక్తులలో ఒకరైన నెపోలియన్ బోనపార్టే యొక్క మాతృభూమిగా కోర్సికా ప్రసిద్ధి చెందింది.

డిసెంబరు 14-15 తేదీలలో అజాక్సియోలో జరగబోయే ఈ రెండు రోజుల సదస్సులో ఫ్రాన్స్, ఇటలీ మరియు స్పెయిన్ నుండి స్థానిక కతోలిక సంఘాల ప్రతినిధులు హాజరవుతారు.

హోలీ సీ ప్రెస్ ఆఫీస్ విడుదల చేసిన పర్యటన వివరాల జాబితా ప్రకారం, 

పోప్ ఫ్రాన్సిస్ గారు ఆదివారం ఉదయం 7:45 గంటలకు Rome Fiumicino అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి, 9:00 గంటలకు అజాక్సియో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు, అక్కడ అధికారిక స్వాగత కార్యక్రమం జరుగుతుంది.

10.15 గంటలకు "Palais des Congrès et d’Exposition d’Ajaccio" పాల్గొనేవారిని ఉద్దేశించి మాట్లాడతారు 

పీఠాధిపతులను, గురువులను, దైవాంకితులను, ఉపగురువులను మరియు గురువిద్యార్దులను , కలవడానికి మరియు వారితో త్రికాల ప్రార్ధనను ప్రార్థించడానికి కేథడ్రల్ ఆఫ్ హోలీ మేరీ ఆఫ్ ది అజంప్షన్‌కు వెళతారు.అక్కడ ఆయన రెండో ప్రసంగం చేస్తారని అని అన్నారు.

మధ్యాహ్నం 3:30 గంటలకు  "Place d’Austerlitz"లోని  , "U casone  " అని పిలువబడే పెద్ద పార్క్ నందు దివ్యబలి పూజ సమర్పించనున్నారు.

అనంతరం సాయంత్రం 5:30 గంటలకు,  ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో అజాక్సియో విమానాశ్రయంలో సమావేశమవుతారు, సాయంత్రం 6:15 గంటలకు రోమ్ ఫియుమిసినో ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరి, సాయంత్రం. 7:05 గంటలకు చేరుకుంటారు 

ఫ్రెంచ్ భూభాగంలో 2014లో స్ట్రాస్‌బర్గ్‌లోని యూరోపియన్ పార్లమెంట్,కౌన్సిల్ ఆఫ్ యూరప్ మరియు 2023లో మార్సెయిల్‌ మెడిటరేనియన్ ఎన్‌కౌంటర్‌లకు వెళ్లిన తర్వాత అపోస్టోలిక్ జర్నీ టు కోర్సికా పోప్ ఫ్రాన్సిస్ గారు వెళ్లబోయే మూడవ పర్యటన.

Tags