ఘనంగా జపమాల మాత పండుగ

ఘనంగా జపమాల మాత పండుగ

విశాఖ అతిమేత్రాసనం, ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో జపమాల మాత పండుగ ఘనంగా జరిగింది. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్ర సామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం జరిగింది.

జపమాల మాత పండుగ సందర్భంగా గ్రామమంతా, విశ్వాసులు జపమాల జపిస్తూ, మరియ తల్లి స్వరూపాన్ని ప్రదక్షిణంగా తీసుకువెళ్ళారు. విచారణ ప్రజలు, యువతీ యువకులు, మఠకన్యలు(Sisters)  పాల్గొనగా జపమాల ప్రార్ధనతో గ్రామా విధులలో తేరు ప్రదక్షణ దేవునికి మహిమకరంగా జరిగింది.

గురుశ్రీ జీవన్ బాబు గారు దివ్య పూజాబలి ని సమర్పించి అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.

విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారు జపమాల మాత పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer