ఘనంగా అమృతవాణి సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం 2025


ఘనంగా అమృతవాణి సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం 2025

అమృతవాణి సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం మార్చి 10, 2025 న  ఘనంగా జరిగింది. అమృతవాణి అధ్యక్షులు, ఏలూరు పీఠాధిపతులు మహా పూజ్య పొలిమేర జయరావు, D.D. గారి ఆధ్వర్యంలో అమృతవాణి సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం 2025   ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో గవర్నింగ్ బాడీ సభ్యులు, TCBC  డిప్యూటీ సెక్రటరీ గురుశ్రీ రాజు అలెక్స్, దివ్యవాణి CEO గురుశ్రీ లూర్దు రాజ్, తెలంగాణ CRI ప్రెసిడెంట్ గురుశ్రీ  స్టానిస్లాస్ SJ, కోశాధికారి శ్రీ విన్సన్ట్ గార్లు  మరియు పలువురు గురువులు జనరల్ బాడీ సభ్యులు పాల్గొన్నారు.      

అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు  కార్యక్రమాని ప్రారంభించారు. APSSS మాజీ డైరెక్టర్ శ్రీమతి కరుణాకుమారి గారు బైబిల్ చదివి మీటింగ్ కొరకు ప్రార్ధించారు.    

మహా పూజ్య పొలిమేర జయరావు గారి ఆదేశానుసారం పరమపదించిన అమృతవాణి వ్యవస్థాపకులు గురుశ్రీ జ్వాన్నెస్ నికోలాస్ మరియా వైన్గార్డ్స్ గారి కొరకు సభ్యులందరు మౌనంపాటిస్తు  నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో గురువులు ,సిస్టర్స్, విశ్వాసులు పాల్గొన్నారు. సుమారు 60  మందికి పైగా సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  రేడియో వెరితాస్ ఆసియ తెలుగు సిబ్బంది తమ కార్యక్రమాలను వివరించారు. గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు వచ్చిన వారందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేసారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer