నికరాగ్వాన్లు ప్రభువు పై ఆశను పునరుద్ధరించుకోవాలని ఫ్రాన్సిస్ పాపు గారు కోరారు

నికరాగ్వాన్లు ప్రభువు పై ఆశను పునరుద్ధరించుకోవాలని పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు కోరారు

నికరాగ్వాలో శ్రీసభ మరియు క్రైస్తవులు తీవ్ర హింసను అనుభవిస్తున్నందున, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు  దేశం యొక్క నిరంకుశ పాలనలో నివసిస్తున్న ప్రజలకు ప్రోత్సాహం మరియు మద్దతును తెలియజేసారు .

"నికరాగ్వాలోని ప్రజలను ఉద్దేశించి మహా పూజ్య ఫ్రాన్సిస్ పాపు గారు  మాట్లాడుతూ  యేసుపై మీ ఆశను పునరుద్ధరించుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను," అని అతను ఆగస్టు 25న ఏంజెలస్‌ వద్ద  ప్రార్థనలలో చెప్పారు.

గత వారంలో, నికరాగ్వాన్ ప్రభుత్వం, దేశంలో పనిచేస్తున్న 1,500 లాభాపేక్షలేని సంస్థల చట్టపరమైన హోదాను ఉపసంహరించుకుంది. వాటిలో చాలా వరకు క్రైస్తవ దేవాలయాలు, అలాగే కథోలిక  స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి.

ఆగస్టు 20న నికరాగ్వా జాతీయ అసెంబ్లీలో క్రైస్తవ దేవాలయాల పై  మరియు అన్ని తెగల మత సంస్థలకు విరాళాలపై పన్ను విధించేందుకు కొత్త చట్టాలను ఆమోదించింది. మరియు ఆగష్టు మొదటి మూడు వారాల్లో, తొమ్మిది మంది కథోలిక గురువులను నికరాగ్వాలో అరెస్టు చేయబడ్డారు. మరి కొంతమంది దేశంనుండి  బహిష్కరించబడ్డారు.

ఈ కష్ట సమయాల్లో మరియతల్లి నికరాగ్వా ప్రజలకు మరియతల్లి తోడుగా ఉండుగాక" అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తన సందర్శకులతో కలసి ప్రార్థించారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer