కొత్త యుకాట్ (YOUCAT) ని ప్రారంభించిన పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు

కొత్త యుకాట్ (YOUCAT) ని ప్రారంభించిన పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు

పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు యువకులకు సత్యోపదేశం (‘Youth Catechism of the Catholic Church ) యొక్క కొత్త ఎడిషన్‌తో పాటుగా ఒక లేఖను విడుదల చేసారు .క్రీస్తు ప్రభువు ఆనందకరమైన జీవితానికి  పాస్‌వర్డ్’ అని ,  క్రీస్తుతో  జీవించడంలోనే అది సాధ్యపడుతుందని అన్నారు.  

"సువార్తను చదవడం, శ్రద్ధగా ప్రార్థించడం మరియు ఉత్సాహంతో సత్యోపదేశం లో పాల్గొనడం   ద్వారా యేసు ప్రభువుని ప్రేమ, కరుణ, జాలిను మనకు తెలుస్తుంది మరియు మన హృదయానికి యేసు ప్రభువుని దగ్గర  చేయడానికి సహాయం చేస్తుంది.పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు సోమవారం ఇటాలియన్ వార్తాపత్రిక లా స్టాంపాలో ప్రచురించబడిన యువకులకు రాసిన లేఖలో YOUCAT యొక్క కొత్త ఎడిషన్ యొక్క సానుకూల సమీక్షను అందించారు.

మనం క్రైస్తవులమైనందుకు దేవుని ప్రేమే నిజమైన కారణమని గుర్తుచేసుకుంటూ, శ్రీసభ సత్యోపదేశంలో  అందరు పాల్గొనాలని యువకులను ప్రోత్సహించారు. శ్రీసభ ఉనికికి ప్రధాన కారణం ప్రేమ” అని ఫ్రాన్సీస్ జగద్గురువులు అన్నారు.తండ్రి దేవుడు ప్రతి మానవుని పట్ల ప్రేమ, జాలి మరియు దయ కలిగి ఉన్నారు అని, మనందరి మీద ప్రేమను  తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు జీవితం ద్వారా మనకు తెలియజేసారని   అన్నారు.

మన పట్ల దేవుని ప్రేమ ఎలావుందో అలానే  మనలో ప్రతి ఒక్కరు మన సహోదర సహోదరీల పట్ల ప్రేమతో ఉండాలని పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు అన్నారు.ఈ యవ్వనం, జీవితం యొక్క ఈ కొత్తదనం అని , క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని, క్రీస్తు తో జీవించడం ద్వారా ఈ జీవితం యొక్క సంపూర్ణతను అందరికి కలగాలని పార్దిస్తున్నాను  అని ఫ్రాన్సీస్ జగద్గురువులు ముగించారు.

Article and Design By
Mkranthi Swaroop
RVA Telugu Online Producer