కర్నూలు మేత్రాసనంలో లూర్దుమాత గుహ మూడవ వార్షికోత్సవ వేడుక

కర్నూలు మేత్రాసనం, లూర్దు మాత బృహత్ దేవాలయము నందు లూర్దు మాత గుహ మూడవ వార్షికోత్సవ వేడుకను, జపమాల మాత పండుగను మరియు మరియమాత పూజిత మాస ముగుంపు వేడుకను ఘనంగా కొనియాడారు 

అక్టోబర్ 31,2024న సాయంత్రం 5 గంటలకు మరియతల్లి భక్తులు ఆ మరియమాత స్వరూపంతో కర్నూలు సి క్యాంపు సెంటర్ నుండి కథెడ్రల్ వరకు ఊరేగింపుగా వచ్చారు.

కర్నూలు పీఠకాపరి మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారిచే పండుగ దివ్యబలి పూజను ప్రారంభించి ఆయన ప్రసంగంలో జపమాల మాత యొక్క ఘనతను, జపమాల జపించడం వలన సకల మానవాళికి కలిగే దీవెనలను వివరించారు.

సుమారు 25 మంది గురువులు, 56 మంది మఠవాసులు, వెయ్యికిపైగా మరియతల్లి భక్తులు ఈ పూజలో పాల్గొని పండుగను ఘనంగా జరిపారు.

లూర్దు మాత బృహత్ దేవాలయ విచారణ కర్తలు గురుశ్రీ సిద్ధిపోగుల దేవదాసు గారు దివ్యబలి పూజను సమర్పించిన మేత్రానులకు, విచ్చేసిన గురువులకు, మఠవాసులకు, ఉపదేశులకు, విశ్వాసులకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియపరిచారు.

Tags