కర్నూలులో ఘనంగా జరిగిన యాత్రికులమాత మహోత్సవం

కుర్నూలు మేత్రాసనం కార్మెల్ నగర్ వెంకాయపల్లి ప్రాంతంలోని యాత్రికుల మాత పుణ్యక్షేత్ర పండుగ డిసెంబరు 8 అమలోద్బవి మాత మహోత్సవం నాడు ఘనంగా జరిగింది 

కర్నూలు మేత్రానులు మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారు యాత్రికుల మాత పండుగ దివ్యబలిపూజకు అధ్యక్షత వహించగా, సుమారు 30 మంది మేత్రాసన గురువులు పాల్గొన్నారు.

మరియమాత కూడా యాత్రికురాలే,  కనుకనే ఆమె మన జీవిత యాత్రలో మనకు తోడుగ ఉన్నారు, మారియమ్మ గారి తన జీవిత యాత్రలో అనేకమైన కష్టాలు అనుభవించారు. కనుక మానవులైన మన జీవిత యాత్రలో కూడా కష్టాలు ఉంటాయి. కానీ ఆ దేవాదిదేవుడు మనకు తోడై ఉంటారని మనం నమ్మాలి అని పీఠాధిపతులవారు విశ్వాసులకు తెలిపారు.

పూజ అనంతరం KDSSS డైరెక్టర్,యాత్రికుల మాత దేవాలయ రెక్టర్ గురుశ్రీ తోటా జోసఫ్ గారు పీఠాధిపతులవారిని సన్మానించారు.

విచ్చేసిన గురువులకు, మఠవాసులకు, మరియా తల్లి భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు   తెలిపారు. 

గృహిణి సెంటర్, నర్సింగ్ సెంటర్ విద్యార్థులు నృత్యప్రదర్శన జరిగింది. 

క్రీస్తు జయంతిని  పురస్కరించుకొని పీఠాధిపతులవారితో కేక్ కటింగ్ కూడా చేయించారు.

పీఠాధిపతులు ఈ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుటకు సహకరించిన వారికి కృతఙతలు తెలిపి, ఆశిర్వదించారు.