ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని అగ్రపీఠాధిపతి పై ఆరోపణ
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని అగ్రపీఠాధిపతి పై ఆరోపణ
భారతదేశంలో జరుగుతున్న జాతీయ ఎన్నికల మధ్య మతపరమైన ప్రాతిపదికన ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం ద్వారా దేశ పోల్ కోడ్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ, ఒక హిందూ అనుకూల సమూహం ఒక క్యాథలిక్ అగ్రపీఠాధిపతి పై చర్య తీసుకోవాలని కోరింది.
దక్షిణ తమిళనాడు రాష్ట్రంలోని మద్రాస్-మైలాపూర్ అగ్రపీఠాధిపతి మహా పూజ్య జార్జ్ ఆంథోనిసామి పై భారత ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని అధికార భారతీయ జనతా పార్టీతో జతకట్టిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ (LRPF) కోరుతోంది .
వారు చేసిన ఫిర్యాదు ప్రకారం మహా పూజ్య జార్జ్ ఆంథోనిసామి ఆర్చ్ డియోసెసన్ పత్రిక " ది న్యూ లీడర్ వీక్లీ"లో వ్రాసిన ఒక వ్యాసం లో భారతదేశం యొక్క ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిస్థితిని ఎత్తి చూపుతూ, 2014 నుండి బీజేపీ పాలనలో క్రైస్తవులు మరియు ముస్లింల దుస్థితిని ఆయన ప్రస్తావించారు.
మరియు "మనమందరం ఓటు వేద్దాం" అని ఆయన రాశారు, ఈ ఎన్నికలను "ముఖ్యమైనవి భారతదేశంలోని 1.4 బిలియన్ల జనాభాలో 2.3 శాతం ఉన్న క్రైస్తవులు తప్పనిసరిగా 100 శాతం ఓటింగ్ ఉండేలా చూసుకోవాలని రాశారు.
ఇది "మతపరమైన ప్రాతిపదికన ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం" అని ఫిర్యాదుదారులు ఆరోపించారు , మహా పూజ్య ఆంథోనిసామి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు అని ఆరోపించారు.
ఎడిటర్ ఫాదర్ గురుశ్రీ ఆంటోనీ పాన్‌క్రాస్ గారు మాట్లాడుతూ, పోల్ కోడ్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలను ఖండించారు. "ఆర్చ్ బిషప్ నిజానికి దేశ ప్రజల, ముఖ్యంగా మైనారిటీల దుస్థితి గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నించారు అని ," గురుశ్రీ ఆంటోనీ పాన్‌క్రాస్ గారు తెలిపారు .
ఫలానా పార్టీకి ఓటు వేయమని ప్రజలను ఆర్చ్ బిషప్ అడగలేదని, "ప్రజలందరూ ఓటు వేయాలని మాత్రమే అయన విజ్ఞప్తి చేసారని " అని గారుశ్రీ పాన్‌క్రాస్ గారు తెలిపారు .
ఫిర్యాదు చేయబడినప్పటికీ, "ఆర్చ్ బిషప్‌కు ఎన్నికల సంఘం నుండి ఇంకా ఎటువంటి నోటీసు రాలేదు" అని పాన్‌క్రాస్ కూడా స్పష్టం చేశారు.
జాతీయ పార్లమెంటులో 543 మంది సభ్యులను ఎన్నుకునేందుకు భారతదేశం యొక్క ఏడు దశల ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమయ్యాయి మరియు జూన్ 1న ముగుస్తాయి. ఫలితాలు జూన్ 4న ప్రకటిస్తారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer