ఉగ్రదాడి తర్వాత ఇరాన్‌కు పోప్ ఫ్రాన్సిస్ సంఘీభావం తెలిపారు
ఉగ్రదాడి తర్వాత ఇరాన్‌కు పోప్ ఫ్రాన్సిస్ సంఘీభావం తెలిపారు
"నేను ఇరాన్ ప్రజలకు, ముఖ్యంగా కెర్మాన్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో గాయపడిన వారికి మరియు బాధకు గురైన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను" అని మహా పూజ్య పొప్ ఫ్రాన్సిస్ గారు అన్నారు.
జనవరి 3న, 2020లో ఆ రోజున డ్రోన్ దాడిలో మరణించిన సైనికాధికారి ఖాసీం సులేమానీ హత్యకు గుర్తుగా జరిగిన స్మారక కార్యక్రమంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
ఇరాన్‌లోని ఆగ్నేయ నగరమైన కెర్మాన్‌లో బుధవారం జరిగిన సంస్మరణ కార్యక్రమంలో జంట పేలుళ్లు సంభవించడంతో 84 మంది మరణించారు. మరో 284 మందికి పైగా గాయపడ్డారు.
ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇస్లామిక్ స్టేట్ గురువారం ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వ ఆధీనంలోని వార్తా సంస్థ IRNA ప్రకారం, ఇస్లామిక్ స్టేట్ (ISIS) టెలిగ్రామ్ పోస్ట్ ద్వారా దాడికి బాధ్యత వహించింది.
ఇద్దరు సోదరులు కెర్మాన్‌లోని సోలైమానిల్ సమాధి దగ్గర నివాళులు అర్పించే వారితో కలసి పోయి తమను తాము పేల్చుకున్నారు.
ఇరాన్ మద్దతు ఉన్న పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ డిప్యూటీ లీడర్ మరణించినప్పటి నుండి ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. 1979 విప్లవం తర్వాత ఇరాన్‌లో జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా ఇది పరిగణించబడుతుంది.
ఈ దాడిని ఇరాన్ యొక్క సుప్రీం లీడర్, అయతుల్లా అలీ ఖమేనీ, తీవ్రంగా ఖండించారు. ఇది హేయమైన, అమానవీయ ఘటన అంటూ పేర్కొన్నారు. ఈ పిరికిపంద చర్యకు సంబంధించిన వారిని త్వరలో గుర్తించి కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.
అయితే పోప్ ఫ్రాన్సిస్ గారు హింస కంటే శాంతిని ఎంచుకోవాలని, ప్రపంచాన్ని శాంతి తాను ఎల్లప్పుడు కోరుకుంటానని అన్నారు.
"యుద్ధంలో చాలా మంది బాధితులు, చాలా మంది మరణాలు, చాలా విధ్వంసం జరుగుతుందని ఇది మంచిది కాదు అని, ... శాంతి కోసం మనమందరం ప్రార్థిద్దాం అని అతను పొప్ ఫ్రాన్సిస్ గారు చెప్పారు.
Article By
M Kranthi Swaroop
RVA Telugu Online Producer