ఇటాలియన్ అధ్యక్షుడు మట్టరెల్లాతో సమావేశమైన పోప్

శుక్రవారం జూన్ 6 న ఇటాలియన్ అధ్యక్షుడు Sergio Mattarellaతో అపోస్టోలిక్ ప్యాలెస్‌లో XIV లియో పోప్ సమావేశమైనట్లు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ ప్రకటించింది.

పోప్‌తో సమావేశమైన తర్వాత, అధ్యక్షుడు Mattarella సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో కార్డినల్ పియట్రో పరోలిన్ మరియు రాష్ట్రాలతో సంబంధాల అండర్-సెక్రటరీ మొన్సిగ్నోర్ మిరోస్లా తో సమావేశమయ్యారు.

"సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో జరిగిన స్నేహపూర్వక చర్చల సందర్భంగా, ద్వైపాక్షిక సంబంధాలకు ప్రశంసలు వ్యక్తమయ్యాయి" అని ఒక పత్రికా ప్రకటన పేర్కొంది. 

"అంతర్జాతీయ అంశాలపై ముఖ్యంగా ఉక్రెయిన్ మరియు మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణలపై దృష్టి సారించారు."

వారు వివిధ సామాజిక అంశాలు మరి ముఖ్యంగా "దేశ మెరుగుదలకు శ్రీసభ సహకారం"పై దృష్టి సారించారు.