ఇజ్రాయెల్ అధ్యక్షుడితో సమావేశమైన పోప్ లియో

సెప్టెంబర్ 4 గురువారం అపోస్టోలిక్ ప్యాలెస్‌లో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ పోప్ లియోను వ్యక్తిగతంగా కలిసారు
పోప్‌తో సమావేశమైన తర్వాత, అధ్యక్షుడు హోలీ సీ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్ మరియు రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి ఆర్చిబిషప్ పౌల్ ను కలిసినట్లు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ పేర్కొంది
పోప్ తో మరియు విదేశాంగ కార్యదర్శితో జరిగిన స్నేహపూర్వక చర్చలలో భాగంగా మధ్యప్రాచ్యంలో రాజకీయ మరియు సామాజిక పరిస్థితిని ప్రస్తావించారు, అక్కడ కొనసాగుతున్న సంఘర్షణలు, గాజా విషాద పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ప్రకటన పేర్కొంది
“చర్చలను త్వరగా పునఃప్రారంభించాలని, అంతర్జాతీయ సమాజం మద్దతుతో, బందీల విడుదలను సాధించవచ్చని,
ముక్యంగా కాల్పుల విరమణను, అత్యంత ప్రభావిత ప్రాంతాలలోకి మానవతా సహాయం సురక్షితంగా ప్రవేశించడాన్ని సులభతరం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాలస్తీనా ప్రజల భవిష్యత్తును ఎలా నిర్ధారించాలనే దాని గురించి మరియు ఆ ] ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వం గురించి చర్చలు జరిగాయని ప్రకటన పేర్కొంది.
పౌర అధికారులు మరియు స్థానిక శ్రీసభ మధ్య సంబంధాలకు సంబంధించిన అనేక అంశాలను,మధ్యప్రాచ్యం అంతటా క్రైస్తవ సమాజాల ప్రాముఖ్యత మరియు వారి నిబద్ధతపై ప్రత్యేక దృష్టి సారించారు,
ముఖ్యంగా విద్య, సామాజిక ఐక్యతను ప్రోత్సహించడం మరియు ప్రాంతీయ స్థిరత్వం వంటి రంగాలలో మానవ మరియు సామాజిక అభివృద్ధికి క్రైస్తవ సమాజాల ప్రాముఖ్యత మరియు వారి నిబద్ధతపై ప్రత్యేక దృష్టి సారించారు.