ఇండోనేషియా చేరుకున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

ఇండోనేషియా చేరుకున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ముస్లింలు మెజారిటీగా ఉన్న ఇండోనేషియాలో అడుగుపెట్టారు.దీనితో సుదీర్ఘమైన ప్రతిష్టాత్మక నాలుగు-దేశాల పర్యటన ప్రారంభమైయింది.

పాపల్ విమానంలో సుమారు 13 గంటల కంటే ఎక్కువ సమయం గడిపిన తర్వాత, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఇండోనేషియాలోని సోకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 11:30 గంటలకు (సుమారు 04 :30 GMT) దిగారు. పీఠాధిపతులు,గురువులు మరియు ప్రభుత్వ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

87 ఏళ్ల పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. విమానం నుండి దిగిన తర్వాత వీల్ చైర్‌లో కూర్చున్నారు. పాపువా సంప్రదాయ దుస్తులు ధరించిన ఇద్దరు పిల్లలు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి పూలతో స్వాగతం పలికారు. అతను  చిరునవ్వుతో ప్రతిస్పందించారు మరియు వారితో  కరచాలనం చేశారు.

ఆ తర్వాత, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని  నూన్సియో మహా పూజ్య  పియర్ పియోప్పో, జకార్తా అగ్రపీఠాధిపతులు కార్డినల్ ఇగ్నేషియస్ సుహార్యో హార్దియాట్‌మోడ్జో , ఇండోనేషియా బిషప్స్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ మహా పూజ్య  ఆంటోనియస్ సుబియాంటో బుంజమిన్ ఆఫ్ బాండుంగ్, ఇండోనేషియా రాయబారి మైఖేల్ ట్రియోనో  స్వాగతం పలికారు.

వాటికన్ రాయబార కార్యాలయానికి వెళ్ళడానికి  సైనిక సిబ్బంది మరియు పోలీసులచే కాపలాగా ఉన్న తెల్లటి కిజాంగ్ ఇన్నోవా జెనిక్స్ కారులో విమానాశ్రయం నుండి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు బయలుదేరారు.

సెప్టెంబరు 4న ఉదయం 9 గంటలకు ఇస్తానా మెర్డెకా ప్యాలెస్‌లో ఆయనకు లాంఛనంగా స్వాగతం పలుకుతారు. దౌత్యవేత్తలు మరియు ఉన్నతాధికారులతో సమావేశానికి వెళ్లే ముందు ఆయన అధ్యక్ష భవనంలో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో కొద్దిసేపు మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు.

సెప్టెంబరు 5న, ఆగ్నేయాసియాలో అతిపెద్దదైన ఇస్తిఖ్‌లాల్ మసీదులో మొత్తం ఆరుగురు  ప్రతినిధులను "సర్వమత సామరస్యం" కోసం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు కలుస్తారు. ఇండోనేషియాలోని అధికారికంగా గుర్తించబడిన  ఇస్లాం, ప్రొటెస్టంట్, కాథోలిక , బౌద్ధమతం, హిందూమతం మరియు కన్ఫ్యూషియనిజం అనే ఆరు మతాల నాయకులు పాల్గొననున్నారు.

ఆ సమావేశంలో  పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు గ్రాండ్ ఇమామ్ నసరుద్దీన్ ఉమర్‌తో సంయుక్త ప్రకటనపై సంతకం చేస్తారు. ఇండోనేషియా పీఠాధిపతుల ప్రకారం, ఈ ప్రకటన "డీమానిటైజేషన్" పై దృష్టి సారించనుంది . ముఖ్యంగా హింస మరియు సంఘర్షణల వ్యాప్తి, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు, అలాగే పర్యావరణ క్షీణత పై చర్యలను తీసుకోనున్నారు.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జకార్తాలో మూడు రాత్రులు ఉంటారు. అక్కడ అతను ఇస్తిక్లాల్ మసీదులో మతపరమైన సమావేశాన్ని నిర్వహిస్తారు మరియు దేశంలోని కాథలిక్కుల కోసం దివ్యబలి పూజను నిర్వహించనున్నారు.

సెంట్రల్ జకార్తాలో "స్వాగతం పోప్ ఫ్రాన్సిస్" అని ప్రకటించే  కొత్త ప్రకటనను ఉంచారు. ప్రభుత్వం అతని గౌరవార్థం ప్రత్యేక స్టాంపును తయారు చేసారు.

ప్రపంచంలో  అత్యధిక జనాభా కలిగిన ముస్లిం మెజారిటీ దేశం ఇండోనేషియా ఒకటి . చాలా ద్వీపాలు, వాటిలో దాదాపు 17,000 మరియు అనేక తెగలు, జాతులు, భాషలు మరియు సంస్కృతులతో కూడిన చాలా పెద్ద దేశం.

 పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కంటే ముందు, ఇద్దరు పోప్‌లు ఈ దేశాన్ని సందర్శించారు. 1970లో పోప్ పాల్ VI మరియు 1989లో పోప్ జాన్ పాల్ II తర్వాత ఇండోనేషియాను సందర్శించిన మూడవ పాపు గారు ఫ్రాన్సిస్ జగద్గురువులు.

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer