అనాథలు మరియు శరణార్థులను కలుసుకున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

అనాథలు మరియు శరణార్థులను కలుసుకున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

సెప్టెంబరు 3న నాలుగు రోజుల పర్యటన కోసం ఇండోనేషియాకు చేరుకున్న తర్వాత జకార్తాలోని అపోస్టోలిక్ న్యాన్సియేచర్‌కు చేరుకున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి స్వాగతం పలికిన 40 మందిలో వృద్ధులు, పనివారు, వీధి పిల్లలు మరియు శరణార్థులు ఉన్నారు.

ఈ సమావేశం లో పాల్గొన్నవారందరు చప్పట్లు కొట్టడం ద్వారా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని అభినందించారు అని ఇటలీకి చెందిన లే క్యాథలిక్ గ్రూప్ యొక్క స్థానిక విభాగం అయిన జకార్తాకు చెందిన "సాంట్ ఎగిడియో కమ్యూనిటీ" సమన్వయకర్త శ్రీ ఎర్లిప్ విటార్సా గారు చెప్పారు. ఈ బృందం ఇండోనేషియా రాజధానిలో పేద మరియు అట్టడుగు వర్గాలకు కొరకు చేస్తుంది.

వారిలో కొందరు చాలా ఉద్వేగానికి లోనయ్యారు మరియు వారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని కలిసినప్పుడు ఏడ్చారు" అని విటార్సా గారు UCA న్యూస్‌తో అన్నారు.

జకార్తాలోని సెకోలా దమై (శాంతి పాఠశాల) విద్యార్థులు అయిన ఇద్దరు పిల్లలు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి ఒక చిత్రాన్ని బహుమతిగా ఇచ్చారు.

ఈ బృందం జాతీయ భాష అయిన "బహాసా ఇండోనేషియా"లో కూడా ఒక పాట పాడింది మరియు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు దానిని ఆనందిస్తున్నట్లు అనిపించింది అని విటార్సా గారు తెలిపారు.

కార్యకమంలో పాల్గొనేవారిలో సాంట్ ఎగిడియో కమ్యూనిటీకి సంబంధించిన తొమ్మిది మంది లబ్ధిదారులు, ఆరుగురు సాధారణ ప్రజలు, పనివారు మరియు ఇద్దరు సోమాలియన్లు మరియు ఎనిమిది మంది శ్రీలంక పౌరులతో సహా 10 మంది శరణార్థులు ఉన్నారు.

శరణార్థులు జెస్యూట్ రెఫ్యూజీ సర్వీస్‌కు చెందినవారు మరియు పిల్లలు దక్షిణ జకార్తాలోని డొమినికన్ సిస్టర్స్ నిర్వహిస్తున్న పాండోక్ సి బోన్సెల్ అనాథాశ్రమానికి చెందినవారు.

శ్రీలంక కథోలిక శరణార్థి అయిన జేమ్స్ సుతాహరన్ మాట్లాడుతూ పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని కలవడానికి తనను మరియు అతని కుటుంబాన్ని ఎన్నుకున్నందుకు శాంట్ ఎగిడియో కమ్యూనిటీకి ధన్యవాదాలు తెలిపారు.

“నాకు మరియు నా కుటుంబానికి ఇది ఒక ప్రత్యేక అనుభవం. నేను అతన్ని చాలా ఆరాధిస్తాను, ”అని జేమ్స్ చెప్పాడు.

జేమ్స్, తన కుటుంబంతో కలిసి 2010లో శ్రీలంకను విడిచిపెట్టాడు. ఇప్పుడు వారు దక్షిణ జకార్తాలో నివసిస్తున్నారు. వారి ఇంటి అద్దెను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) చెల్లిస్తుంది.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, నన్ను, నా భార్య, కుమార్తె మరియు కొడుకును ఆశీర్వదించినందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని UCA న్యూస్‌తో అన్నారు.

అధికారిక సమాచారం ప్రకారం వివిధ దేశాల నుండి దాదాపు 12,295 మంది శరణార్థులు ఇండోనేషియాలో నివసిస్తున్నారు.

నేషనల్ స్టాటిస్టికల్ అథారిటీ ప్రకారం, మార్చి నాటికి, ఇండోనేషియా జనాభాలో 25.22 మిలియన్ల మంది పేదరికంలో నివసిస్తున్నారు.

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer