అమలోద్భవిమాత నూతన దేవాలయ ప్రతిష్ట

మే 23,2024 న ఖమ్మం పీఠం, వైరా, సోమవరం నందు అమలోద్భవిమాత నూతన దేవాలయ ప్రతిష్ఠోత్సవం ఘనంగా జరిగింది.

ఖమ్మం మేత్రాసన పీఠకాపరి మహా పూజ్య సగిలి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో నూతన దేవాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

ఖమ్మం మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు మహా పూజ్య మైపాన్ పాల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని, మహా పూజ్య సగిలి ప్రకాష్ గారితో కలసి నూతన దేవాలయ ప్రారంభోత్సవం చేసారు.

ఈ కార్యక్రమంలో గురువులు, సిస్టర్స్ , విచారణ ప్రజలు పాల్గొన్నారు. విచారణ గాయక  బృందం మధురమైన గీతాలను ఆలపించారు.

వైరా విచారణ గురువులు గురుశ్రీ పి అరుళ్ ప్రకాశం గారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన పీఠాధిపతులకు, గురువులకు, విశ్వాసులకు కృతజ్ఞతలు తెలిపారు.