సెయింట్ మదర్ థెరిసా | Sep 5

సెయింట్ మదర్ థెరిసా |
"సెయింట్ మదర్ థెరిసా"(ఆగస్టు 26, 1910 – సెప్టెంబర్ 5, 1997) ఒక కతోలిక సిస్టర్ (సన్యాసిని). కలకత్తాలో ఆమె చేసిన నిస్వార్థమైన సేవ ఎంతో మందిని కదిలించింది. ఎక్కడినుండో మన దేశానికీ వచ్చి అంటరాని వారిని , కృష్టిరోగులను , ఆనాధలు ఆదరించి ఆదుకుని వారికీ కొత్త జీవితాన్ని ప్రసాదించింది.
రోగాల బారిన పడిన వారిని ఎవ్వరు ముట్టుకోడానికి కూడా సాహసించని సమయంలో తాను స్వయంగా వారి చేయిపట్టుకుని, వారికీ దైర్యం చెప్పి, వారికీ కావాల్సిన వైద్య సహాయాన్ని అందించింది. అలంటి వారి కొరకు ఆమె 1950లలో మిషనరీస్ ఆఫ్ ఛారిటీని స్థాపించారు.
దీని ద్వారా ఆమె పేదలు, అనారోగ్యంతో ఉన్నవారు, మరియు అనాధలకు సేవ చేశారు. కేవలం పేదలకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. మదర్ థెరిసా గారి నుండి, సాటి మనిషి పట్ల నిస్వార్థ ప్రేమ, కరుణ మరియు ప్రతి వ్యక్తిలో క్రీస్తును చూడటం వంటి ప్రాముఖ్యతను మనం నేర్చుకుంటాము.
ఆమె "ఈ జీవితంలో మనం గొప్ప పనులు చేయలేము. మనం చిన్న చిన్న పనులను మాత్రమే గొప్ప ప్రేమతో చేయగలము." అనే వారు.
ఆమె కరుణకు గుర్తింపుగా, మదర్ థెరిసాకు 1979లో నోబెల్ శాంతి బహుమతి లభించింది మరియు 1997లో ఆమె మరణించే వరకు ఆమె నిరుపేదలకు సహాయం చేస్తూనే ఉంది. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు 2016లో ఆమెకు సెయింట్ హోదాను ప్రకటించారు.
ప్రస్తుత రోజులలో మన దేశంలో ఇలాంటి నిస్వార్థమైన సేవ చేస్తున్న క్రైస్తవ సిస్టర్స్ పై దాడులు, అరెస్టులు జరగడం నిజంగా బాధాకరం. సాటి మనిషిని ప్రేమిస్తూ, వారి కష్టాలలో , వారి రోగ, బాధలలో మేము ఉన్నామంటూ వారిని ఆదరిస్తూ నిస్వార్థమైన సేవ చేస్తున్న క్రైస్తవులందరి కొరకు ప్రార్దించుదాం!
Article and design by : M kranthi Swaroop