క్రైస్తవుల సహాయమాత పండుగ

క్రైస్తవుల సహాయమాత పండుగ

క్రీ.శ.1808లో 7వ పయస్ భక్తినాద  జగద్గురువులుగారిని నియంత అయిన నెపోలియన్ చక్రవర్తి కారాగారంలో బంధించాడు. తిరిగి 1814 సం॥లో మే 24వ తేదీన 74 సం॥ల పాపు గారిని విడుదలచేశాడు.  పాపు గారు విజయోత్సాహంతో విశ్వాసుల జయజయధ్వానాలమద్య రోమునగర పేతురు సింహాసనం తిరిగి అధిష్టించారు.క్రీ.శ.1815లో జరిగిన యుద్ధంలో సంకీర్ణ సేనలు నెపోలియన్ సైన్యాన్ని ఓడించి తరిమికొట్టాయి.

ఈ సందర్భంగా 7వ పయస్ పాపు గారు తాము చెరనుండి విడుదలైన వార్షికోత్సవం రోజున (మే 24వ) క్రైస్తవుల యొక్క సహాయమాత ఉత్సవాన్ని ప్రకటించి ఘనంగా ఆ తల్లిని కొనియాడారు.

సువిశేషములో మరియతల్లి దేవ వరప్రసాదముచే నిండినదిగా వర్ణించబడినది.
మరియమాత ఎన్నో తరాలుగా దేవుని ప్రియ బిడ్డలకు తల్లిగా, క్రైస్తవులు నిత్య సహాయమాతగా నిలిచింది.

అందరికి క్రైస్తవుల సహాయమాత పండుగ శుభాకాంక్షలు

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer