మరిన్ని చెట్లను నాటాలి: కంబోడియా బిషప్

మరిన్ని చెట్లను నాటాలి: కంబోడియా బిషప్
కంబోడియాకు చెందిన ఒక బిషప్ అన్ని వర్గాల ప్రజలు మరిన్ని చెట్లను నాటడం ద్వారా పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు.
కంబోడియాలోని తాహెన్‌లోని సెయింట్ జోసెఫ్ దేవాలయంలో సెప్టెంబర్ 1, 2025న సృష్టి కాలం(Season of Creation)ను బట్టంబాంగ్ ప్రస్తుత అపోస్టోలిక్ ప్రిఫెక్ట్ మహా ఘన ఎన్రిక్ ఫిగరెడో అల్వార్గోంజాలెజ్ గారు ప్రారంభించారు.
మహా ఘన ఎన్రిక్ ఫిగరెడో అల్వార్గోంజాలెజ్ మాట్లాడుతూ "సహోదర సహోదరీలందరూ చెట్లను నాటడం మరియు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా మన పర్యావరణాన్ని కాపాడవచ్చు అని , అందరు దీనిలో పాల్గొని చెట్లు నాటాలని కోరారు. చెట్లను నాటడం ద్వారా పర్యావరణాన్ని రక్షించడానికి మరియు మెరుగుపరచడానికి ఒక సులభమైన మార్గమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బట్టంబాంగ్ ప్రావిన్స్‌లోని సిహానౌక్విల్లే బౌద్ధ శాఖ అధిపతి డాక్టర్ వి. సోవిచ్ గారు తో సహా దేవాలయ నాయకులు, బౌద్ధ సన్యాసులు, యువత, మహిళలు, పిల్లలు మరియు అనేక మంది మత పెద్దలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ప్రారంభంలో, మహా ఘన ఎన్రిక్ ఫిగరెడో అల్వార్గోంజాలెజ్ గారు , బౌద్ధ సన్యాసులు మరియు కతోలిక గురువులు గౌరవ చిహ్నంగా కాషాయ వస్త్రంతో ఒక చెట్టును అలంకరించారు. తరువాత వారు దేవాలయ ప్రాంగణంలో ఒక ఊరేగింపులో చేరారు, ఆ తర్వాత సృష్టి కాలం మరియు పర్యావరణ సంరక్షణ యొక్క ప్రాముఖ్యతపై మాట్లాడారు.
సృష్టి కాలం(Season of Creation) ఐదు వారాల పాటు ఉంటుంది. అంటే సృష్టి సంరక్షణ కోసం ప్రపంచ ప్రార్థన దినం (సెప్టెంబర్ 1) నుండి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి పండుగ రోజు (అక్టోబర్ 4) వరకు జరగనున్నది.
కంబోడియా ఆధికారికంగా కంపూచియా సామ్రాజ్యము అని గుర్తించబడే ఈ దేశం ఆగ్నేయ ఆసియా లోని ఇండోనీషియా ద్వీపకల్పానికి దక్షిణంగా ఉంది. రాచరిక విధానం అనుసరిస్తున్న దేశమిది. కాంబోడియా వాయవ్య సరిహద్దులలో థాయ్ లాండ్, ఈశాన్యంలో లావోస్ తూర్పున వియత్నాం, ఆగ్నేయంలో థాయ్ లాండ్ జలసంధి ఉన్నాయి. 1.48 కోట్ల జనాభా కలిగిన కంబోడియా ప్రపంచంలో జనసాంద్రతలో 68వ స్థానంలో ఉంది. కంబోడియా అధికార మతం " తెరవాడ బౌద్ధమతం". తెరవాడ బౌద్ధమతాన్ని దేశ జనాభాలో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. దేశంలోని అల్పసంఖ్యాకులు వియత్నామీయులు, చైనీయులు, చాములు, 30 రకాల గిరిజనులు మొదలైన ఉన్నారు.
Article and Design By M Kranthi Swaroop