షెడ్యూల్డ్ తెగలకు సహాయాన్ని అందించిన సెయింట్ విన్సెంట్ డి పాల్ సొసైటీ

భారతదేశంలోని ఆదిమ ప్రజలలో ఒకరైన "ఇరులర్" సమూహానికి సహాయం చేయడానికి సెయింట్ విన్సెంట్ డి పాల్ సొసైటీ (SSVP), కాపుచిన్ ఫ్రాన్సిస్కాన్ సభవారు మరియు ప్రభుత్వ అధికారులు ఒకటైయ్యారు.

జూన్ 25న, పాండిచ్చేరి అగ్రపీఠానికి చెందిన SSVP ప్రధాన సభ్యులు "ఇరులర్" సమూహాని నివసించే "సెంజికుప్పం" సెటిల్‌మెంట్‌ను సందర్శించారు.

తలిర్ కపుచిన్ సెంటర్‌ నందు SSVP సభ్యులు, కపుచిన్ ఫ్రాన్సిస్కాన్స్- గురుశ్రీ నిత్య సగాయం, OFM.Cap,గురుశ్రీ సత్యశీలన్, OFM.కాప్ -మరియు ప్రభుత్వ అధికారులులో "ఇరులర్" సమూహాని సమర్థవంతంగా సహాయం చేసే మార్గాలను చర్చించారు.

SSVP మాజీ అధ్యక్షుడు మరియు పాండిచ్చేరికి అగ్రపీఠానికి చెందిన ఉపాధ్యాయుడు రాజ్ కుమార్ మరియు SSVP కోర్ గ్రూప్ సభ్యుడు మరియు ప్రభుత్వ ఉపాధి పథకంతో వ్యవహరించే అధికారి జోసఫ్ ప్రజలను వ్యక్తిగతంగా కలిసి వారి కుటుంబ స్థితి గురించి వివరాలు సేకరించి, వారి అవకాశాలను తనిఖీ చేసింది.

పిల్లలకు స్టేషనరీని పంపిణీ చేశారు. ఎస్‌ఎస్‌విపి కార్యదర్శి పిల్లలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.

SSVP అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కథోలిక స్వచ్ఛంద సంస్థ 1833లో స్థాపించబడింది.

Tags