రెండవ జాతీయ క్రైస్తవ బిషప్‌ల ఫెలోషిప్ సమావేశం

భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CBCI) ఆధ్వర్యంలో మే 09, 2025న మధ్యాహ్నం 03.00 నుండి 05.30 వరకు బెంగళూరులోని సెయింట్ జాన్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (SJNAHS)లో రెండవ జాతీయ క్రైస్తవ మత బిషప్‌ల ఫెలోషిప్ మరియు జాతీయ చర్చిల సమాఖ్య ఏర్పాటుపై సంప్రదింపుల సమావేశం నిర్వహించారు.
దాదాపు 35 మంది అగ్రపీఠాధిపతులు / పీఠాధిపతులు, చర్చి నాయకులు మరియు వివిధ చర్చిలు మరియు క్రైస్తవ ప్రతినిధులు పాల్గొన్నారు.
చర్చిల మధ్య ఐక్యత మరియు సహవాసాన్ని పెంపొందించడం, తద్వారా భారతదేశంలో క్రైస్తవ మత ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశ ఉద్దేశ్యం.
ఇందులో జాతీయ స్థాయిలో చర్చిల సమాఖ్యను ఏర్పాటు చేయాలనే CBCI ప్రతిపాదనపై అధ్యక్షులు / మోడరేటర్లు / మెట్రోపాలిటన్లు / ప్రధాన చర్చిల ప్రధాన అధిపతుల సంప్రదింపులు కూడా ఉన్నాయి.
325 ADలో కాన్స్టాంటినోపుల్ సమీపంలోని నైసియాలో జరిగిన మొదటి క్రైస్తవ ఐక్యత సమావేశ 1,700వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపిక చేసిన థీమ్ “మీరు దీన్ని విశ్వసిస్తున్నారా ?” (యోహాను 11:26), అనే అంశంపై ప్రార్ధనతో ఈ సమావేశం ప్రారంభించబడింది. భారతదేశం - పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ బాధితుల కొరకు మరియు వారి మధ్య సాధారణ స్థితి, శాంతి నెలకొనాలని కూడా ప్రార్థించారు. Council of Evangelical Churches in India (CECI) జనరల్ సెక్రటరీ బిషప్ అఖ్లేష్ ఎడ్గార్ నేతృత్వంలో దివంగత పోప్ ఫ్రాన్సిస్‌కు నివాళులర్పించారు. మరియు కుకి ఆరాధన సేవల కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు Rev. Lunmang Haokip నేతృత్వంలో జరిగిన ప్రార్థనలో నూతన 14 వ సింహరాయ జగద్గురువు కొరకు ప్రార్ధించారు.
CBCI అధ్యక్షుడు మహా పూజ్య Mar Andrews Thazhath స్వాగత మరియు ప్రారంభ ప్రసంగం చేశారు. సెప్టెంబర్ 13, 2024న జరిగిన జాతీయ క్రైస్తవ బిషప్‌ల ఫెలోషిప్ (NEBF ) సమావేశ విశేషాలు NEBF సమన్వయకర్త గురుశ్రీ డాక్టర్ ఆంథోనిరాజ్ తుమ్మా సమర్పించారు.
2025 జూబ్లీ మరియు మొదటి ఎక్యుమెనికల్ కౌన్సిల్ ఆఫ్ నైసియా మరియు నైసియాన్ క్రీడ్ యొక్క 1700వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని కార్యక్రమాలను సెప్టెంబర్ 11 – 12, 2025 తేదీలలో తదుపరి జాతీయ ఎక్యుమెనికల్ బిషప్‌ల ఫెలోషిప్ సమావేశంతో పాటు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. గురుశ్రీ డాక్టర్ ఆంథోనిరాజ్ తుమ్మా గారి వందన సమర్పణతో ఈ సమావేశం ముగించారు.