మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ తో సత్కరించబడ్డ కార్డినల్ జోసఫ్ కౌట్స్

కరాచీ విశ్రాంత అగ్రపీఠాధిపతులు కార్డినల్ జోసఫ్ కౌట్స్, మతాంతర సంభాషణ, జాతీయ సామరస్యం మరియు మైనారిటీ హక్కుల పరిరక్షణకు చేసిన కృషికి పాకిస్తాన్ ప్రతిష్టాత్మకమైన "Tamgha-i-Imtiaz" (మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్)తో సత్కరించబడ్డారు.
ఇస్లామాబాద్‌లో మార్చి 23న అధ్యక్షుడు అలీ జర్దారీ ఈ అవార్డును కార్డినల్ కు ప్రదానం చేసారు.
పాకిస్తాన్లో ఐక్యత మరియు సామాజిక శ్రేయస్సును పెంపొందించిన ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు దాతృత్వ కార్యక్రమాలకు నిబద్ధతతో వ్యవహరించినందుకు కార్డినల్ కౌట్స్ గుర్తింపు పొందారు.
మతాంతర సంభాషణ మరియు శాంతిని ప్రోత్సహించడంలో ఆయన అంకితభావం ఆయనకు విస్తృత ప్రశంసలను తెచ్చిపెట్టింది అని అధ్యక్షుడు జర్దారీ ఆయనను "పాకిస్తానీయులకు ప్రేరణ"గా అభివర్ణించారు.
పాకిస్తాన్ క్రైస్తవ సమాజంలో కీలక వ్యక్తి అయిన కార్డినల్ కౌట్స్ ప్రస్తుతం రావల్పిండిలోని క్రైస్తవ అధ్యయన కేంద్రానికి నాయకత్వం వహిస్తున్నారు, ఇది ఐదు దశాబ్దాలకు పైగా మత సామరస్యాన్ని కాపాడిన గౌరవనీయమైన క్రైస్తవ సంస్థ.
భారతదేశంలోని అమృత్సర్‌లో 1945లో జన్మించిన ఆయన 1971లో గురువుగా అభిషేకింపబడ్డారు .
2021 వరకు హైదరాబాద్, ఫైసలాబాద్ మరియు కరాచీలకు పీఠాధిపతిగా పనిచేశారు.
Pakistan Catholic Bishops’ Conference కు నాయకత్వం వహించారు మరియు 2018లో పోప్ ఫ్రాన్సిస్ చేత కార్డినల్‌గా నియమించబడ్డారు.