మీవలె మీ పొరుగువారిని ప్రేమించండి

గోల్డెన్ రూల్
కార్డినల్ ఫ్రాన్సిస్ జేవియర్

ఇతరులు మీకు ఏమి చేయాలనుకుంటున్నారో వారికి మీరు చేయండి అనే గోల్డెన్ రూల్ మతాల మధ్య విజయవంతమైన మరియు ఫలవంతమైన సంభాషణను సాధించడానికి ఉపయోగపడుతుంది అని థాయిలాండ్ కార్డినల్ ఫ్రాన్సిస్ జేవియర్ అన్నారు.

ఇవే పదాలు దాదాపు అన్ని ప్రధాన మతాల పవిత్ర గ్రంథాలలో ఉన్నాయి," అని బ్యాంకాక్ అగ్ర పీఠాధిపతి ఫ్రాన్సిస్ జేవియర్, పోప్ ఫ్రాన్సిస్ మంగోలియా పర్యటన ఆసియాలోని చర్చిపై చూపే ప్రభావం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

"ఈ అంశం మనల్ని కలుపుతుంది. మనం ఈ అంశం నుండి ప్రారంభించవచ్చు," అని ఆయన చెప్పారు.

సరైన అనువాదం మరియు అమలుతో, మతాంతర సంభాషణ ద్వారా సువర్ణ నియమాన్ని ప్రతిబింబించడం సాధ్యమవుతుందని పీఠాధిపతి అన్నారు.

బౌద్ధ మత ఆధిపత్యం ఉన్న థాయ్‌లాండ్‌లో 30,000 కంటే ఎక్కువ మంది కథోలికులకు నాయకత్వం వహిస్తున్నందున మతాంతర సంభాషణ అనేది కార్డినల్ హృదయానికి దగ్గరగా ఉండే అంశం.

దేశంలో రెండు అగ్రపీఠాలతో సహా 11 పీఠాలు ఉన్నాయి.

అంతేకాకుండా, పోప్ ఫ్రాన్సిస్ మంగోలియా పర్యటనపై కూడా కార్డినల్ కోవిట్వానిట్ వ్యాఖ్యానించారు.

కథోలికులు మైనారిటీలుగా ఉన్న మరొక ఆసియా దేశానికి పాపు గారి సందర్శన ఆసియ వారు  ఇప్పటికీ చర్చిలో భాగమేనని మరియు మరచిపోబడలేదని చెప్పడానికి ఒక బలమైన సందేశమని ఆయన అన్నారు.

పోప్ ఫ్రాన్సిస్ మంగోలియాలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి అధిపతి, ఇది "సమాజం యొక్క అంచులను" చేరుకోవాలనే ఆయన దృష్టికి అనుగుణంగా ఉంది.

ఆయన మంగోలియాను "తక్కువ జనాభా కలిగి ఉన్నా గొప్ప సంస్కృతి కలిగిన దేశంగా పేర్కొన్నారు".