చాలా మంది వలసదారులు దోపిడీకి గురవుతారు - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు
చాలా మంది వలసదారులు దోపిడీకి గురవుతారు - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు రెస్క్యూ(ResQ) అనే సంస్థతో సమావేశమయ్యారు. ఇది మధ్యధరా సముద్రం మీదుగా ప్రయాణించే వేలాది మంది వలసదారులకు సహాయాన్ని అందిస్తుంది.
2014 నుండి దాదాపు 31,000 మంది వలసదారులు మధ్యధరా సముద్రం దాటడానికి ప్రయత్నించి తప్పిపోయారు. గత ఏడాది మాత్రమే, 3,000 మందికి పైగా ప్రజలు ఈ క్రాసింగ్‌లో మరణించినట్లు నిర్ధారించబడింది.
రెస్క్యూ(ResQ) ను ప్రమాదంలో ఉన్న వ్యక్తుల జీవితాలను మరియు హక్కులను రక్షించడానికి స్థాపించబడింది. డిసెంబర్ 11న, పరిశుద్ధ పొప్ ఫ్రాన్సిస్ గారు రెస్క్యూ సభ్యులతో సమావేశమయ్యారు మరియు మధ్యధరా మరియు బాల్కన్ మార్గాల్లో ప్రయాణించే వలసదారుల కోసం వారు చేస్తున్న "విలువైన పని"ని ప్రశంసించారు.
రెస్క్యూ(ResQ) వారు చేసే పనిలో ముఖ్యంగా వలసదారులు ప్రయాణించేటప్పుడు ప్రమాదవశాత్తు మునిగిపోతున్న వారిని తాత్కాలిక పడవలలో రక్షించడం మరియు కష్టతరమైన ప్రయాణాల తర్వాత ఐరోపాకు వచ్చే వలసదారులకు సహాయాన్ని అందించడం వంటివి ఉన్నాయి.
"ప్రజలు తీవ్రమైన సంఘర్షణల వల్ల నాశనమైన ప్రదేశాల నుండి పారిపోతున్నారు అని , మరియు వారి యొక్క ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని " అలంటి వ్యక్తుల ప్రాణాలను ఈ రెస్క్యూ(ResQ) సంస్థ కాపాడుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన పని అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు నొక్కిచెప్పారు.
"జాతీయత, చర్మం రంగు, రాజకీయ అభిప్రాయం లేదా మతంతో సంబంధం లేకుండా ప్రతి మానవుడు అద్వితీయుడు మరియు వారి గౌరవం ఉల్లంఘించబడదు" అనే దృఢ నిశ్చయం ఈ పని చేస్తున్న వారి గుండెలో ఉందని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.
చాల సందర్భాలలో "వలసదారులలో చాలా మంది జీవితాలు దోపిడీ చేయబడుతున్నాయి, తిరస్కరించబడ్డాయి, దుర్వినియోగం చేయబడ్డాయి లేదా బానిసత్వానికి తగ్గించబడుతున్నాయి" అని పరిశుద్ధ పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు బాధపడ్డారు.
చివరిగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు రెస్క్యూ(ResQ) వారు చేస్తున్న పనిలో మరియు వలసదారులకు సహాయం కొరకు మేరీ మాత యొక్క మధ్యవర్తిత్వంకోరడం ద్వారా ముగించారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer