ప్రేమను రాగాలతో "అవ్వల తాతయ్యల దినోత్సవం"

 ప్రేమను రాగాలతో  "అవ్వల తాతయ్యల దినోత్సవం"

విశాఖ అతిమేత్రాసనం, కైలాసపురం విచారణ వేళంగాణిమాత  దేవాలయం లో "అవ్వల తాతయ్యల దినోత్సవం"  ఘనంగా జరిగింది. విచారణ కర్తలు, ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ సంతోష్ CMF, గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

విచారణ కర్తల ఆదేశానుసారం చిన్నారులు వారి అవ్వలు ,తాతయ్యలను తీసుకుని దివ్య పూజాబాలి లో పాల్గొన్నారు. ఉదయం 7.30 గంటలకు జపమాల అనంతరం ఈ ప్రత్యేక దివ్యబలి పూజను గురుశ్రీ సంతోష్ CMF  మరియు  గురుశ్రీ జాన్ వట్టికనాల్ CMF లు సమర్పించారు. అధికసంఖ్యలో విశ్వాసులు భక్తి శ్రద్ధలతో ఈ దివ్య బలిపూజలో పాల్గొన్నారు.విచారణ గాయక బృదం మధురమైన గీతాలను ఆలపించారు.

 చిన్నారులు, యువతీయువకులు గురుశ్రీ జాన్ వట్టికనాల్ CMF  గారిని సన్మానించారు. గురుశ్రీ సంతోష్ CMF పెద్దవారందరికి బహుమతులు అందించారు.  వారికొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు.  అవ్వల తాతయ్యల మరియు పెద్దవారి నుండి చిన్నారులు,యువతీయువకులు దీవెనలను తీసుకున్నారు. ఈ సందర్భముగా అవ్వల తాతయ్యలకు బహుమతులను అందించారు.

గురుశ్రీ సంతోష్ గారు మాట్లాడుతూ పిల్లలకు అమ్మమ్మ తాతయ్యలతో బంధం తప్పనిసరిగా  ఉండాలని అన్నారు. వారితో ఉంటేనే మంచి విలువలు తెలుసుకుంటారు అని అన్నారు.  

పిల్లలు ,పెద్దల ప్రేమను రాగాలతో దేవాలయంలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. గురుశ్రీ సంతోష్ గారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer