ఘనంగా క్లారేషియన్ సభ యువజన ఉత్సవాలు

ఘనంగా క్లారేషియన్ సభ యువజన ఉత్సవాలు

క్లారేషియన్ సభ బెంగుళూరు ప్రొవిన్స్ యువత మరియు ఒకేషన్ మినిస్ట్రీ వారి ఆధ్వర్యంలో యువజన ఉత్సవాలు  ఘనంగా జరిగాయి.

హైదరాబాద్ అతిమేత్రాసనం మేడ్చెల్ లోని సెయింట్ క్లారెట్ హై స్కూల్ నందు ఈ కార్యక్రమం జరిగింది. అక్టోబర్ 8 నుండి 10 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 17 విచారణల నుండి సుమారు 450  మందికి పైగా యువతీ యువకులు పాల్గొన్నారు.   

మొదటిరోజు హైదరాబాద్ యువతతో అతిధులను స్వాగతం పలికారు. అనంతరం జరిగిన దివ్య బలిపూజలో యువతీ యువకులందరు పాల్గొన్నారు. యువతీ యువకులందరు మధురమైన గీతాలను  ఇంగ్లీష్ , హిందీ , పంజాబీ , ఝార్ఖండ్ , కన్నడ మరియు తెలుగు భాషలలో పాడారు.

అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బెంగుళూరు  ప్రొవిన్సియల్  సుపీరియర్ గురుశ్రీ  సాబు CMF, గారు  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువతకు ఎంతో అమూల్యమైన సందేశాలను గురుశ్రీ  సాబు CMF, గారు అందిచారు.  క్లారేషియన్ సభకు చెందిన గురువులు గురుశ్రీ తుమ్మ  జైపాల్  రెడ్డి CMF, గారుతో పాటూ అధికసంఖ్యలో గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

యువతీ యువకుల కొరకు  దివ్య సత్ప్రసాద ఆరాధన నిర్వహించారు. యువతీ యువకులకొరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. నాయకత్వ లక్షణాలు గురించి చర్చించారు. ఆద్యంతం కన్నులపండుగగా ఈ యువజన ఉత్సవాలు  జరిగాయి.

 


Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer