ఇండియన్ కాథలిక్ యూత్ మూమెంట్ కౌన్సిల్ సమావేశం

జనవరి 21 -24 ఉత్తరాఖండ్‌, కత్‌గోడమ్‌,బరేలీ మేత్రాసనంలో జరిగిన ఇండియన్ కాథలిక్ యూత్ మూమెంట్ కౌన్సిల్ సమావేశంలో నెల్లూరు మేత్రాసనానికి చెందిన డాక్టర్ ఏ సుమన్ ఫ్రాన్సిస్ గారు FIMCAP భారతదేశ ప్రతినిధిగా ఎన్నికయ్యారు 

FIMCAP అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువకుల సాధికారత మరియు సంఘీభావం కోసం పనిచేసే అంతర్జాతీయ క్యాథలిక్ పరోక్యల్ యూత్ సమాఖ్య. 

డాక్టర్ సుమన్ ఫ్రాన్సిస్ గారు నెల్లూరు కథెడ్రల్ కు చెందిన వారు.

వీరు నెల్లూరు మేత్రాసన యువత అధ్యక్షుడుగాను, తెలుగు కాథలిక్ యూత్ మూవ్‌మెంట్ అధ్యక్షుడుగాను TCYM మరియు భారత కాథలిక్ యూత్ మూవ్‌మెంట్ జాతీయ కోశాధికారి ICYM తమ సేవలందించారు.

సుమన్ గారు ఇతర దేశాలలో జరిగే కౌన్సిల్‌లలో పాల్గొనడానికి భారతదేశానికి ప్రతినిధిగా ఎన్నికకావడం మనకు ఎంతో గర్వకారణం.

వీరికి అమృతవాణి రేడియో వేరితాస్ ఆసియా తెలుగు విభాగం వారి తరపున శుభాకాంక్షలు

Tags