పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ యుద్ధం కారణంగా బాధపడుతున్న ప్రజల ప్రాథమిక హక్కులను కొరకు మరియు లక్షలాది మంది ప్రజల శాంతి కోసం చేస్తున్న కేకలు వినాలని ప్రభుత్వ నాయకులను కోరారు.
సెప్టెంబరులో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి అపోస్టోలిక్ సందర్శన కోసం ఎదురుచూస్తున్న పాపువా న్యూ గినియా (PNG)లోని ఒక పట్టణంలోని కథోలికులు మరియు పౌర సమాజ సభ్యులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని ప్రత్యక్షంగా చూసే అవకాశం పట్ల ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేశారని శ్రీసభకు చెందిన ఒక గురువు చెప్పారు.