ఫ్రాన్సిస్ పాపు గారు చారిత్రక ఆసియా పర్యటనకు బయలుదేరారు

ఫ్రాన్సిస్ పాపు గారు చారిత్రక ఆసియా పర్యటనకు బయలుదేరారు
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి సెప్టెంబర్ 2-13 తేదీలలో ఇండోనేషియా, ఈస్ట్ తైమూర్, పాపువా న్యూ గినియా మరియు సింగపూర్‌లకు వెళ్లనున్నారు . ఈరోజు సాయంత్రం రోమ్ కాలమాన ప్రకారం 17 :15 కు ఈ పర్యటన మొదలు కానున్నది.
1 సెప్టెంబర్ ఆదివారం, తన 45వ అపోస్టోలిక్ జర్నీకి ముందు, ఫ్రాన్సిస్ పాపు గారు రోమ్‌లోని బసిలికా ఆఫ్ శాంటా మారియా మాగ్గియోర్ లో మరియతల్లి ని ప్రార్ధించారు మరియు తన రాబోయే అపోస్టోలిక్ ప్రయాణాన్ని ఆమెకు అప్పగించారు.
బసిలికాలో ప్రార్థనల తరువాత, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు వాటికన్కు తిరిగి వచ్చారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి 12 రోజుల సుదీర్ఘ పర్యటన ఇది అని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ ప్రకటించింది.
సర్వమత సామరస్యం కోసం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జకార్తాలోని ఇస్తిఖ్‌లాల్ మసీదును సందర్శించనున్నారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సర్వమత సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇండోనేషియాలోని అధికారికంగా గుర్తించబడిన ఇస్లాం, ప్రొటెస్టంట్, కాథోలిక , బౌద్ధమతం, హిందూమతం మరియు కన్ఫ్యూషియనిజం అనే ఆరు మతాల నాయకులు హాజరవుతారని భావిస్తున్నారు.
1970లో పోప్ పాల్ VI మరియు 1989లో పోప్ జాన్ పాల్ II తర్వాత ఇండోనేషియాను సందర్శించిన మూడవ పాపు గారు ఫ్రాన్సిస్ జగద్గురువులు అవుతారు. ఇండోనేషియాలోని 277 మిలియన్ల జనాభాలో 87 శాతం మంది ముస్లింలు, అయితే దేశంలో ఆగ్నేయాసియాలో రెండవ అతిపెద్ద క్రైస్తవ జనాభా కూడా ఉంది.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer