PETA కార్యకర్తలు ఫ్రాన్సీస్ జగద్గురువుల కార్యకమానికి అంతరాయం కలిగించారు

PETA కార్యకర్తలు ఫ్రాన్సీస్ జగద్గురువుల కార్యకమానికి అంతరాయం కలిగించారు

ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా బుల్రింగ్‌లలో వేలాది ఎద్దులు వధించబడుతున్నాయి.
దీనికి నిరసనగా "పెటా" కార్యకర్తలు (PETA ) మహా పూజ్య ఫ్రాన్సీస్ జగద్గురువుల ప్రసంగానికి  అంతరాయం కలిగించారు.
ఆగస్టు 7న బుధవారం నాడు వాటికన్‌లోని పాల్-VI హాల్‌ లో మహా పూజ్య ఫ్రాన్సీస్ జగద్గురువులు, సాధారణ ప్రేక్షకుల సమావేశంలో ఈ సంఘటన జరిగింది.  
ఈ కార్యక్రమంలో జంతు హక్కుల సంఘం PETA కి చెందిన ఇద్దరు కార్యకర్తలు "కారిడాస్‌ను ఆశీర్వదించడం ఆపు" అనే వ్యాఖ్యలు రాసిన టీ-షర్టు ధరించి, 'ఎద్దుల పోరు పాపం' అని రాసి ఉన్న పోస్టర్‌తో  అరుస్తూ బ్యానర్‌లను ప్రదర్శించారు.ఈ జంటను వాటికన్ భద్రత మరియు ఇటాలియన్ పోలీసులు అదుపులోనికి  తీసుకుని తర్వాత విడుదల చేసారు .
"కోరిడాస్," లేదా బుల్ ఫైట్‌లు స్పెయిన్ మరియు అనేక లాటిన్ అమెరికా దేశాలలో అలాగే దక్షిణ ఫ్రాన్స్ మరియు పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాలలో ఆచరించే వివాదాస్పద సంప్రదాయం.ప్రతి సంవత్సరం, PETA ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా బుల్రింగ్‌లలో వేలాది ఎద్దులు వధించబడుతున్నాయి.
16వ శతాబ్దంలో, మహా పూజ్య ఐదవ పియస్ పాపు గారు ఇటువంటి  క్రూరమైన మరియు "క్రైస్తవ భక్తి మరియు దాతృత్వానికి" విరుద్ధంగా జరుగుతున్న ఎద్దుల పందాలను నిషేధించారు.
ఇది స్పెయిన్‌లో గౌరవప్రదమైన సాంస్కృతిక సంప్రదాయంగా పరిగణించబడుతున్నప్పటికీ, బుల్‌ఫైటింగ్ అనేది ఎద్దును చంపే ముందు వెక్కిరించడం మరియు ఎద్దును చంపడానికి అనేక కత్తిపోట్లు పొడుస్తారు.

 

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer