CELAM 40వ ఆర్డినరీ జనరల్ అసెంబ్లీ సమావేశం

లాటిన్ అమెరికా మరియు కరేబియన్ బిషప్‌లు 1955లో Rio de Janeiroలో మొదటి సామాన్య సమావేశం జరిగి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లాటిన్ అమెరికా మరియు కరేబియన్ ఎపిస్కోపల్ కౌన్సిల్ (CELAM) 40వ ఆర్డినరీ జనరల్ అసెంబ్లీకి సమావేశమయ్యారు.

ఈ సందర్బంగా Porto Alegre అగ్రపీఠాధిపతులు మహా పూజ్య Cardinal Jaime Spengler
కు పోప్ ఒక టెలిగ్రామ్ పంపారు.

కౌన్సిల్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తూ, శ్రీసభ సంబంధాలను నిరంతర బలోపేతం చేయాలని ఈ టెలిగ్రాంలో వారిని కోరారు.

అమెరికన్ ఖండాలలో మరియు శ్రీసభ చరిత్రలో CELAM పోషించిన పాత్రను పోప్ ప్రసంశించారు.

ఈ ఆనందకరమైన వార్షికోత్సవ వేడుకలలో, ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పడంలో నేను మీతో ఏకము అవుతాను" అని పొప్ పేర్కొన్నారు.