267వ పోప్‌ను ఎన్నుకునే సమావేశం మే 7న ప్రారంభమవుతుంది.

267వ పోప్‌ను ఎన్నుకునే సమావేశం మే 7న ప్రారంభమవుతుంది.
వాటికన్ సినడ్ హాల్‌లో సోమవారం ఏప్రిల్ 28 ఉదయం జరిగిన కార్డినల్ల ఐదవ సార్వత్రిక సమావేశంలో కొత్త పోప్ ఎన్నికను మే 7 నుండి ప్రారంభించనున్నారని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశం వాటికన్‌లోని సిస్టీన్ చాపెల్(Vatican’s Sistine Chapel)లో జరగనున్నది. ఆ రోజుల్లో సందర్శకులకు ప్రవేశం లేదు.
ఈ సమావేశానికి ముందు , కార్డినల్ ఎలక్టర్లు అందరితో దివ్యబలిపూజ జరగనున్నది. అనంతరం మధ్యాహ్నం, కార్డినల్ ఎలెక్టర్లు సిస్టీన్ చాపెల్‌కు బహిరంగ ఊరేగింపుగా వెళతారు. అక్కడ కొత్త పోప్‌ను ఎన్నుకోవడానికి కాన్‌క్లేవ్ (Conclave)ప్రారంభమవుతుంది.
మొదటిగా పోప్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియలో నమ్మకంగా, నియమనిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేశారు.
ఓట్లు లెక్కించబడిన తర్వాత, అన్ని బ్యాలెట్లను కాల్చివేస్తారు. బ్యాలెట్(ఓటింగ్) అసంపూర్ణంగా ఉంటే, సిస్టీన్ చాపెల్ పైన ఉంచిన చిమ్నీ నల్లటి పొగను వెదజల్లుతుంది.
పోప్ ఎన్నికైతే, చిమ్నీ నుండి తెల్లటి పొగ బయటకు వస్తుంది.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer