సెయింట్ ఆంతోని పాఠశాల పునఃప్రారంభం

 సెయింట్ ఆంతోని పాఠశాల పునఃప్రారంభం

విశాఖ అతిమేత్రాసనం, మహారాణిపేట విచారణలో గల  "సెయింట్ ఆంతోని పాఠశాల" ఆగస్టు 1వ తేదీ నుంచి పునః ప్రారంభంకానున్నట్లు విశాఖ అతిమేత్రాసన విశ్రాంత అగ్రపీఠాధిపతులు  మహా పూజ్య డాక్టర్ మల్లవరపు ప్రకాశ్ గారు తెలిపారు.

ఈ మేరకు శనివారం పాఠశాల ఆవరణలో విశ్రాంత అగ్రపీఠాధిపతులు  మహా పూజ్య మల్లవరపు ప్రకాశ్ గారు, గురుశ్రీ పొలమరశెట్టి రత్నకుమార్ గారు జ్యోతి వెలిగించి శిలాఫలకం ఆవిష్కరించారు.  మహా పూజ్య మల్లవరపు ప్రకాశ్ గారు మట్లాడుతూ ఆగస్టు 1 నుంచి సెయింట్ ఆంతోని ఇంగ్లీషు మీడియం పాఠశాలగా అందుబాటులోకి వస్తుందన్నారు. పాఠశాల ప్రారంభానికి  పాఠశాల డీజీఎం గురుశ్రీ  పొలమరశెట్టి రత్నకుమార్ గారు చూపిన శ్రద్ధ, ఆసక్తి అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో సెయింట్ ఆంతోని దేవాలయ విచారణకర్తలు గురుశ్రీ  దుగ్గంపూడి బాలశౌరి గారు , గురుశ్రీ కొండల జోసెఫ్ గారు,  గురుశ్రీ  కూన జయరాజు గారు , గురుశ్రీ ప్రతాప్ , గురుశ్రీ వేలాంగణి , ఇతర గురువులు ,సిస్టర్ హేమ, పాఠశాల పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు.

సెయింట్ ఆంతోని ఎయిడెడ్ పాఠశాలను 1940లో ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది విద్యార్థులుకి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలు చేరేలా బాటలు వేసింది.  ఇక్కడ   విద్యను అభ్యసించి విద్యార్థులు ఐఏఎస్, ఐసీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉన్నత స్థానాల్లో దేశానికి సేవలు అందించారు.

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer