సి.సి.బి.ఐ యువతా కమిషన్‌కు అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా గురుశ్రీ డొమినిక్ పింటో నియామకం.
లక్నో మేత్రాసనానికి చెందిన గురుశ్రీ డొమినిక్ పింటో (42)గారిని, CCBI యువతా కమిషన్‌కు అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నియమించారు.
బెంగళూరులో 2024 మే 7 నుండి 8 వరకు సమావేశమైన CCBI 94వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో వీరిని నియమించడం జరిగింది.
ప్రస్తుతం తను ఆగ్రా రీజినల్ బిషప్స్ కౌన్సిల్ యూత్ కమిషన్ రీజినల్ డైరెక్టర్‌గా తన సేవను అందిస్తున్నారు.
కర్నాటకలో, బజ్పేలో 13 ఆగస్టు 1982న జన్మించిన డొమినిక్ గారు తన ప్రాధమిక విద్యను తన స్వగ్రామంలోని పరోచియల్ హయ్యర్ ప్రైమరీ పాఠశాల మరియు సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్‌లో అభ్యసించారు.
గురుత్వంవైపు అతని ప్రయాణం లక్నోలోని సెయింట్ పాల్స్ మైనర్ సెమినరీలో ప్రారంభమైంది, అక్కడ అతను 2002 నుండి 2004 వరకు తన అధ్యయనాలను కొనసాగించారు.
నాగ్‌పూర్‌లోని సెయింట్ చార్లెస్ సెమినరీలో తాత్విక మరియు వేదాంత శిక్షణను పొందారు .
20 అక్టోబర్ 2013న లక్నో మేత్రాసనానికి గురువుగా అభిషేకింపబడ్డ గురుశ్రీ డొమినిక్ గారు వివిధ విచారణలలో తన సేవలందించారు.
2016లో డాన్ బాస్కో కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా ,2016 నుండి 2018 వరకు సెయింట్ పాల్స్ మైనర్ సెమినరీ వైస్ రెక్టార్ తన సేవలను అందించారు.
2014 నుండి 2018 వరకు మేత్రాసన యువతా మినిస్ట్రీ డైరెక్టర్‌గా అతని పదవీకాలం వినూత్న కార్యక్రమాలు మరియు పరివర్తన ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లతో గుర్తించబడింది.
2021 నుండి తను ప్రాంతీయ యూత్ డైరెక్టర్‌గా పనిచేశారు, ఆధ్యాత్మిక వృద్ధిని మరియు సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి యువజన సంఘాలతో చురుకుగా నిమగ్నమై ఉన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా తను CCBI యువతా కమిషన్ లో వివిధ కార్యక్రమాలతో సన్నిహితంగా సహకరిస్తున్నారు