శ్రీసభ నాయకత్వం బాధ్యతాయుతమైన AI'ని రూపొందించడం అవసరం : డా.రుఫిని

 
 శ్రీసభ నాయకత్వం బాధ్యతాయుతమైన AI'ని రూపొందించడం అవసరం : డా.రుఫిని

ఫిలిప్పీన్స్ లిపా సిటీలో  7వ జాతీయ కాథలిక్ సోషల్ కమ్యూనికేషన్స్ కన్వెన్షన్‌ ఘనంగా మొదలయ్యింది . ఈ సమావేశం ఫిలిప్పీన్స్ కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (CBCP) యొక్క ఎపిస్కోపల్ కమీషన్ ఆన్ సోషల్ కమ్యూనికేషన్స్ (ECSC) ద్వారా నిర్వహించబడుతుంది. ఈ సమావేశం  ముఖ్యంగా  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) లో పురోగతి మరియు నష్టాలను  అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఆగస్టు 5 నుండి 8 వరకు జరిగే ఈ కన్వెన్షన్‌లో దేశవ్యాప్తంగా 86 డియోసెస్‌ల నుండి 300 మంది కథోలిక సమాచార కర్తలు(Catholic communicators) మరియు సోషల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్లు, నాయకులు  సమావేశమయ్యారు.

హోలీ సీస్ డికాస్టరీ ఫర్ కమ్యూనికేషన్  ప్రిఫెక్ట్ అయిన డాక్టర్ పాలో రఫ్ఫినీ గారు  మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం నైతికత్వంను రూపొందించడంలో శ్రీసభ ప్రముఖ పాత్ర వహించాలని పిలుపునిచ్చారు.

“డిజిటల్ ప్రపంచం అనేది రెడీమేడ్ కాదు, ఇది ప్రతిరోజూ మారుతూ ఉంటుంది. మనం, దానిని మార్చగలం మరియు ప్రేమతో  మానవ మేధస్సుతో దీన్ని మంచి మార్గంలో నడిపించేందుకు మనకు  కథోలిక సమాచార కర్తలు కావాలి, ”అని డాక్టర్ రుఫిని అన్నారు.

ఈ సమావేశ ప్రారంభ వేడుకలో, CBCP-ECSC చైర్‌పర్సన్ బోయాక్‌కు చెందిన బిషప్ మహా పూజ్య మార్సెలినో ఆంటోనియో మరాలిట్ గారు మాట్లాడుతూ  శ్రీసభకి మరియు మానవ కుటుంబానికి AI అంటే ఏమిటో హాజరైనవారికి  గుర్తు చేశారు.

అయన మాట్లాడుతూ  ఇది మారుతున్న యుగమని, "ఎప్పటికైనా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను మనం నిశితంగా పర్యవేక్షించాలి" అని పీఠాధిపతి అన్నారు.

ఈ కొత్త సాధనం ఏ విధంగా వ్యక్తుల మధ్య సంబంధాలను  పటిష్టం చేస్తుంది  లేదా, దీనికి విరుద్ధంగా, ఇప్పటికే ఒంటరిగా ఉన్నవారి ఒంటరితనాన్ని మరింత పెంచుతుందా అనే సందేహం ఉందని, సమాచార శక్తి ఆధారంగా కొత్త సోపానక్రమాలను ఏర్పాటు చేయడం కంటే, సమానత్వాన్ని పెంపొందించడానికి కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేయవచ్చా అనే క్లిష్టమైన సమస్యను డాక్టర్ రఫ్ఫినీ నొక్కిచెప్పారు.  

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer