వేర్వేరు సంఘటనల్లో ఒక గురువు మరియు ఒక సన్యాసిని ఆత్మహత్య

వేర్వేరు సంఘటనల్లో ఒక గురువు  మరియు ఒక సన్యాసిని ఆత్మహత్య

రెండు వేర్వేరు సంఘటనల్లో ఒక గురువు  మరియు ఒక సన్యాసిని(sister) ఆత్మహత్య చేసుకోవడం యావత్తు శ్రీసభను దిగ్భ్రాంతికి గురిచేసింది.

దక్షిణ కేరళ రాష్ట్రంలోని కోతమంగళం డియోసెస్‌లోని వజకులంలోని సెయింట్ జార్జ్ ఫోరేన్ దేవాలయ ఫాదర్ గురుశ్రీ జోస్ కుజికన్నియిల్ గారి  మృతదేహాన్ని జూలై 25న ఒక గదిలో వేలాడుతున్నట్లు విచారణ ప్రజలు కనుగొన్నారు . అతన్ని సమీపంలోని సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు, తర్వాత 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మువట్టుపుజాలోని నిర్మల ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతని మరణం నిర్ధారించబడింది, 64 ఏళ్ల ఫాదర్ (గురువు) మరణించినట్లు ప్రకటించారు.

డియోసెసన్ ఛాన్సలర్ ఫాదర్ గురుశ్రీ జోస్ కులత్తూర్ గారు ఒక ప్రకటనలో గురుశ్రీ కుజికన్నియిల్ గారి మరణాన్ని ధృవీకరించారు.

మరొక సంఘటనలో, సిస్టర్స్ ఆఫ్ ది అడరేషన్ ఆఫ్ ది అడరేషన్ ఆఫ్ ది బ్లెస్డ్ సాక్రమెంట్ (SABS) సభ్యురాలైన సిస్టర్ ఆన్ మారియా, సెంట్రల్ కేరళలోని సమీపంలోని కంజిరపల్లి డియోసెస్‌లోని కనిజ్రమలాలోని ఒక కాన్వెంట్‌లోని తన గదిలో ఉరి వేసుకుని కనిపించింది.
50 ఏళ్ల సన్యాసిని కాన్వెంట్‌లో సేవలందిస్తున్నారు. ప్రత్యేక ప్రార్థనలు మరియు రిట్రీట్‌లో ఈమె నిమగ్నమై ఉన్నారు.

సైరో-మలబార్  యొక్క రెండు డియోసెస్‌లు సెంట్రల్ కేరళలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు చే "కథోలిక గురువులను మరియు సన్యాసినులను"  అధికంగా  గౌరవించే సంప్రదాయాన్ని  కలిగి ఉంది.

ఈ తూర్పు ఆచార దేవాలయంలోని కథోలికలకు అపొస్తలుడైన పునీత తోమా వారు  తమ పూర్వీకులకు బాప్టిజం ఇచ్చారని అక్కడ విచారణ ప్రజలు పేర్కొన్నారు. దేవుని చే దీవింపబడి,  ప్రజలచే గౌరవించబడిన వారే ఇటువంటి తీవ్రమైన చర్యలకు దారితీసే కారణాలను శ్రీసభ  పరిశోధించాలి, అని ఒక విచారణ సభ్యుడు  చెప్పారు.

"మా విచారణ గురువు  ఆత్మహత్య గురించి విని మేము షాక్ అయ్యాము" అని దేవాలయ సభ్యుడు  జెరిన్ పి జాన్ అన్నారు.

గురుశ్రీ కుజికన్నియిల్ గారు "దయగలవాడు మరియు విచారణ  సభ్యులతో ఎప్పుడూ ఎలాంటి సమస్యలు లేవని జూలై 25న UCA న్యూస్‌తో అయన అన్నారు. అతని మరణానికి దారితీసిన పరిస్థితులు ఇంకా తెలియలేదు " అని ఛాన్సలర్ ప్రకటనలో పేర్కొన్నారు.

సిస్టర్ మారియా “చాలా సంవత్సరాలుగా వైద్య చికిత్స పొందుతోంది” అని ఆమె సంస్థ  ఒక ప్రకటనలో తెలిపింది.

 "గురువులు  మరియు సన్యాసినులు ఆత్మహత్య చేసుకోవడం వింతగా మరియు దిగ్భ్రాంతికరంగా ఉంది" అని కంజిరపల్లి డియోసెస్‌లోని క్రైస్ట్ రాజ్ (క్రీస్తురాజు) చర్చి ట్రస్టీ చెరియన్ జోసెఫ్ చెప్పారు .  ఆత్మహత్యలకు దారితీసే కారణాలను శ్రీసభ  పరిశోధించాలని ఆయన డిమాండ్ చేశారు.

కేరళలోని క్రైస్తవులు మూడవ అతిపెద్ద మత సంస్థ గా ఉన్నారు, రాష్ట్రంలోని 33 మిలియన్ల జనాభాలో 18 శాతం మంది ఉన్నారు. జనాభాలో హిందువుల ఆధిపత్యం, ముస్లింలు దాదాపు 20 శాతం ఉన్నారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer