వెళాంగిణిమాత పుణ్యక్షేత్రం దేవుని ప్రేమకు నిదర్శనం - కార్డినల్ ఫెర్నాండెజ్
వెళాంగిణిమాత పుణ్యక్షేత్రం దేవుని ప్రేమకు నిదర్శనం - కార్డినల్ ఫెర్నాండెజ్
తమిళనాడులోని వేలంకన్నిలోని "అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్" (వెళాంగిణిమాత పుణ్యక్షేత్రం) బాసిలికాకు వేలాది మంది హిందువులు మరియు ముస్లింలు తీర్థయాత్ర చేయడం దేవుని ప్రేమకు సంకేతం అని, ఆందోళనకు కారణం కాదని కార్డినల్ మహా పూజ్య ఫెర్నాండెజ్ గారు అన్నారు.
"విశ్వాసంతో ఇక్కడికి ప్రయాణించే లక్షలాది మంది యాత్రికులకు ఈ పుణ్యక్షేత్రంలో లభించే అనేక ఆధ్యాత్మిక ఫలాలు, పొందుకుంటున్నా స్వస్థలు ఈ ప్రదేశంలో పవిత్రాత్మ యొక్క స్థిరమైన చర్యను గుర్తించేలా చేస్తాయి" అని డికాస్టరీ ప్రిఫెక్ట్ కార్డినల్ మహా పూజ్య విక్టర్ మాన్యుయెల్ ఫెర్నాండెజ్ గారి మాటలను ఆగస్ట్ 1 నాటి లేఖలో మరియు డికాస్టరీ వెబ్సైట్లో పోస్ట్ చేయబడింది.
బాసిలికాను ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు సందర్శిస్తారు. మరియా మాత గారి పండుగరోజులలో ముఖ్యంగా ఆగస్టు 29 మరియు సెప్టెంబర్ 8 మధ్య జరిగే పుణ్యక్షేత్రం యొక్క ప్రధాన వేడుకల కోసం ప్రతి సంవత్సరం 1 మిలియన్ మంది ప్రజలు చెన్నై లోని సముద్రతీర పట్టణంలోకి వస్తారు.
చాలా మంది క్రైస్తవేతర యాత్రికులు "ఓదార్పు, ప్రశాంతత కోరుకునే" వారు కూడా వెళాంగిణిమాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఆధ్యాత్మికంగా ప్రయోజనం పొందుతారు అని కార్డినల్ ఫెర్నాండెజ్ గారు రాశారు.
"వారిలో కొందరు వారి అనారోగ్యాల నుండి స్వస్థపరచబడ్డారు అని, చాలామంది శాంతి మరియు ఓదార్పులను పొందుతారు" అని కార్డినల్ చెప్పారు. "నిస్సందేహంగా, మరియ మాత మధ్యవర్తిత్వానికి ప్రతిస్పందిస్తూ, పరిశుద్ధాత్మ కూడా వారికీ తోడుగా పని చేస్తుంది అని అన్నారు. సందర్శించే యాత్రికులు వారి బాధను మరియు ఆశను మరియ తల్లి హృదయానికి అప్పగిస్తారు" అని ఆయన చెప్పారు.
ఉత్తర భారతదేశంలోని బంగాళాఖాతంలోని ఒక చిన్న గ్రామమైన వేలంకన్నిలో 16వ శతాబ్దంలో నివేదించబడిన మరియా మాత యొక్క "అందమైన సంప్రదాయాల" గురించి కూడా లేఖలో ప్రస్తావించబడింది .
చరిత్ర చూసినట్లు ఐతే 1570 మేలో స్థానిక గొర్రెల కాపరి బాలుడు సమీపంలోని ఇంటికి పాలు పంపిణీ చేస్తున్నప్పుడు మొదటి మరియ మాత దర్శనం సంభవించినట్లు చెబుతారు. మార్గమధ్యంలో ఒక అందమైన స్త్రీ ఒక బిడ్డను పట్టుకొని, బిడ్డకు పాలు కావాలని కోరింది. ఆమెకు కొంత పాలు ఇచ్చిన తరువాత తన ప్రయాణం సాగించాడు. పాలు పంపిణీ ముగించిన తర్వాత, పాల జగ్గు ఇంకా తాజా, చల్లని పాలతో నిండి ఉందని అతను కనుగొన్నాడు. బాలుడు స్త్రీని ఎదుర్కొన్న ప్రదేశానికి సమీపంలో ఒక చిన్న మందిరం నిర్మించబడింది.
తరువాత, మరియ మాత వైలంకన్ని వెలుపల మజ్జిగ అమ్ముతున్న ఒక కుంటి బాలుడికి కనిపించింది మరియు అతనికి స్వస్థత కలిగింది.
వేలంకన్నితో సంబంధం ఉన్న మూడవ అద్భుతం పోర్చుగీస్ నావికుల బృందంతో ముడిపడి ఉంది, వారు ఓడ ప్రమాదం నుండి మరియ మాత వారిని రక్షించారని నమ్ముతారు. వారు వైలంకన్ని తీరానికి చేరుకుని అక్కడ ఒక చిన్న ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer