విశాఖ అగ్రపీఠంలో భక్తియుతంగా ప్రారంభమైన జూబిలీ 2025 ప్రారంభ వేడుకలు

విశాఖ అగ్రపీఠంలో భక్తియుతంగా ప్రారంభమైన జూబిలీ 2025 ప్రారంభ వేడుకలు

విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, రక్షణగిరి పుణ్యక్షేత్రంలో జనవరి 2, 2025న విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారు అధికారికంగా జూబ్లీ 2025 సంవత్సరాన్ని ప్రారంభించారు.

ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతర గురువులతో కలసి దివ్య పూజాబలిని సమర్పించారు. మహా పూజ్య పొలిమెర జయరావు గారు జూబ్లీ సంవత్సర ఇతివృత్తంగా నిరీక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.

వేలమంది ఈ జూబిలీ ప్రారంభ వేడుకలో పాల్గొనగా జ్ఞానాపుర వీధులలో జూబ్లీ సిలువను ఊరేగింపుగా, మేళతాళాలతో ఊరేగించారు.

ఈ కార్యక్రమం లో విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ దుగ్గంపూడి బాలశౌరి గారు, విశాఖ అతి మేత్రాసన ఛాన్సలర్  గురుశ్రీ జొన్నాడ ప్రకాశ్ గారు, MSFS  ప్రొవిన్సియల్  సుపీరియర్  గురుశ్రీ బవిరి  సురేష్ గారు, గురుశ్రీ యుగాల కుమార్, గురుశ్రీ జీవన్ బాబు,   గురుశ్రీ ఆండ్రూ ఆనంద్, గురుశ్రీ హరీ ఫిలిప్స్,  గురుశ్రీ సానబోయిన శౌరిబాబు , గురుశ్రీ రాజ్ కుమార్ ,గురుశ్రీ ప్రొక్యూటర్ గురుశ్రీ జయరాజు గారు, గురుశ్రీ సరిస ప్రతాప్ గారు, గురుశ్రీ మరియారత్నం గారు, గురుశ్రీ రవితేజ గారు, గురుశ్రీ ఆర్జి ప్రకాష్ గారు, గురుశ్రీ ప్రతాప్ , గురుశ్రీ విమల్ రాజ్ , గురుశ్రీ రవితేజ మరియు ఇతర విచారణల నుండి సుమారు 150 మంది గురువులు, 30 మందికి పైగా సిస్టర్స్ పాల్గొన్నారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer