వలసదారులకు ఆధ్యాత్మిక వడ్డకాన్ని నిర్వహించిన గోవా అగ్రపీఠం

హోలీ ఫామిలీ ఆఫ్ నాజరేత్ సభ మఠకన్యలు 2025 ఏప్రిల్ 6న కోర్లిమ్లోని సెయింట్ జాన్ విచారణలో వలసదారులకు ప్రత్యేక ఆధ్యాత్మిక వడ్ఢకాన్ని నిర్వహించారు
స్వస్థలాలకు దూరంగా ఉన్నవారు, క్రీస్తు ప్రభువుపై విశ్వాసం బలోపేతం చేయడానికి మరియు ఆధ్యాత్మిక వృద్ధికి సమయాన్ని అందిచడం లక్ష్యంగా "నిరీక్షణా యాత్రికులు" అనే ఇతివృత్తంపై ధ్యానించారు.
ఈ ఆధ్యాత్మిక వడ్ఢకంలో పాల్గొన్న వారు దేవునిపై విశ్వాసం, నిరీక్షణా మరియు నమ్మకంతో ప్రయాణించే యాత్రికులుగా జీవించాలి అని మొదటి సెషన్ నిర్వహించిన రాజేశ్వర్ జోసఫ్ బెనర్జీ అన్నారు
మౌన ప్రార్థన మరియు ధ్యానం, దివ్యసత్ప్రసాద ఆరాధన, పాపసంకీర్తనాలు కొరకు సమయాన్ని కూడా కేటాయించారు. గురుశ్రీ జో నాజరేత్ S.J. దివ్యబలి పూజను సమర్పించారు
కోర్లిమ్ విచారణ గురువులు గురుశ్రీ కెవిన్ రోడ్రిగ్స్ గారి నేతృత్వంలో,Sr. Jeryssa Pereira SFN and Sr. Myra Dourado SFN సమన్వయంతో ఈ వడ్డకం జరిగింది
జార్ఖండ్ నుండి గోవాకు వలస వచ్చిన సుమారు 80 మంది ఈ వడ్డకంలో పాల్గొన్నారు
ఈ సభ వారు వలసదారులకు వారి పాఠశాలలు మరియు సామాజిక కేంద్రాల ద్వారా విద్యా అవకాశాలను అందిస్తుంది