యువతా జూబ్లీ జాగరణ కళాకారులను కలిసిన పోప్

రోమ్‌లో శనివారం ఆగస్టు 2 సాయంత్రం యువతా జూబ్లీ సందర్భంగా Tor Vergataలో జాగరణను యానిమేట్ చేయనున్న కళాకారులను ఉద్దేశించి పోప్ లియో మాట్లాడారు.
యువత క్రీస్తుప్రభువులో నిజమైన ఆనందాన్ని కనుగొనేలా ప్రోత్సహించమని కళాకారులను కోరారు.
శనివారం ఉదయం వాటికన్‌లోని Sala Clementinaలో బృందాన్ని అనధికారికంగా స్వాగతించారు,
రోమ్‌లో జూబిలీకి విచ్చేసిన యువ సమూహానికి మీరు అందించే కళ, సంగీతం - మీ ప్రతిభ - గురించి తెలుసుకుని, ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేసాను అని పోప్ అన్నారు
రోమ్ పీఠాధిపతిగా, పోప్ గా ఈ ప్రేషితకార్యంలో పాల్గొనగలగడం ఒక గౌరవం, ఆశీర్వాదం అని తన భావాన్ని పోప్ వ్యక్తపరిచారు
అంతేకాకుండా, వీరి ప్రదర్శన ద్వారా యువత హృదయాలలో ప్రభువని బహుమతులు ఆనందం, ప్రేమ, మరియు విశ్వాసాన్ని అనుభవించేలా చేయవచ్చు అని పోప్ అన్నారు
సంగీతం, నృత్యం మరియు వారు పంచుకునే అనేక కళాత్మక వ్యక్తీకరణలు ఈ బహుమతులలో ఉన్నాయని ఆయన గుర్తించారు.
పోప్ తన ఆశీర్వాదాని ఇస్తూ ఈ సమావేశం ముగించారు.