బ్రదర్ జోచిమ్ కెర్కెట్టా SVD: దేవుని ద్రాక్షతోటలో వినయపూర్వకమైన సేవకుడు
![](/sites/default/files/styles/max_width_770px/public/2024-03/svd_rip.jpg?itok=rya7Cb_I)
బ్రదర్ జోచిమ్ కెర్కెట్టా SVD: దేవుని ద్రాక్షతోటలో వినయపూర్వకమైన సేవకుడు
ఒక సాధారణ, నిరాడంబరమైన, కష్టపడి పనిచేసే, ప్రేమగల మరియు నిబద్ధతతో కూడిన నిస్వార్థమైన దేవుని సేవ చేసిన మిషనరీ సోదరుడు ఫాదర్ జునిపెర్ (జోచిమ్ కెర్కెట్టా) జనవరి 3న మధ్యప్రదేశ్, ఇండోర్ లో పాల్డా అనే పట్టణంలో సెయింట్ జోసెఫ్స్ హోమ్ లో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు.ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా మేత్రాసనం సుందర్ఘర్లోని జున్మూర్ విచారణలో, మే 15, 1931న, దివంగత మార్కస్ కెర్కెట్టా మరియు దివంగత శ్రీమతి సుసానా కీరో దంపతులకు జన్మించారు. జోచిమ్ కెర్కెట్టా మార్చి 1, 1951న గురు విద్యార్థిగా క్యాథలిక్ ఆశ్రమ పాల్డాలో చేరారు.డిసెంబర్ 21, 1954న తన మొదటి మాటపట్టు డికెన్ గా ప్రమాణం చేసారు. గురువుగా డిసెంబర్ 21, 1960న ప్రమాణం చేసారు.అతని నవీకరణ(novitiate ) సమయంలో, అతను జునిపెర్ అనే పేరును తీసుకున్నారు.