బాంగుయ్ పాఠశాల బాధితుల కొరకు ప్రార్ధించిన పోప్

జూన్ 29 త్రికాల జపము అనంతరం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లోని బాంగూయ్‌లో ఉన్న బార్తెలెమీ బోగండా ఉన్నత పాఠశాలలో జరిగిన దురదృష్టకర ప్రమాదంలో ఎంతోమంది విద్యార్థులు మరణించారు, గాయపడ్డారు ani పోప్ లియో . 

ఈ విషాదం తర్వాత, దుఃఖంలో మునిగిపోయిన వారందరికీ నా ప్రార్థనల హామీని అందిస్తున్నాను. ప్రభువు వారి కుటుంబాలను, యావత్ సంఘాన్ని ఓదార్చుగాక అని పొప్ అన్నారు 

మీ అందరికీ, ముఖ్యంగా రోము నగర పాలక పునీతుల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను! రోములోని వివిధ విచారణలలో నిస్వార్థంగా సేవలందిస్తున్న విచారణ గురువులను, ఇతర గురువులను ప్రేమపూర్వకంగా గుర్తు చేసుకుంటున్నాను. 

వారి అంకితభావమైన సేవకు నా కృతజ్ఞతలు. నా ప్రోత్సాహం ఎల్లప్పుడూ వారికి ఉంటుంది.

పునీతులు పేతురు, పౌలులకు సంబంధించిన రోమునగర ప్రదేశాలలో జరుగుతున్న “క్వో వాదిస్?” (Quo Vadis?) కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నా ఆశీస్సులు.