"నిరీక్షణకు సాక్ష్యమివ్వడానికి ధైర్యం చూపండి" - పొప్ ఫ్రాన్సిస్

నవంబర్ 24, 2024 క్రీస్తురాజు మహోత్సవం మరియు 39వ ప్రపంచ యువతా దినోత్సవం సందర్భంగా రోమ్‌లోని పోర్చుగల్ మరియు దక్షిణ కొరియా నుండి వచ్చిన యువకుల ప్రతినిధుల బృందాలకు పోప్ ఫ్రాన్సిస్ శుభాకాంక్షలు తెలియచేసారు . 

2027లో జరగబోయే ప్రపంచ యువజన సమ్మేళనానికి ఆతిథ్యం ఇవ్వనుండగా  
శిలువ మరియు మేరీ సాలస్ పాపులి రొమానీ చిహ్నాన్ని, పోర్చుగీస్ వారు కొరియన్లకు అందించారు.

సెయింట్ పీటర్స్ బసిలికాలో క్రీస్తు రాజు మహోత్సవ దివ్యబలి పూజ ముగింపులో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువకులను,

ప్రత్యేకించి 2023లో జరిగిన ప్రపంచ యువజన దినోత్సవానికి ఆతిథ్యం ఇచ్చిన పోర్చుగల్ ప్రతినిధి బృందానికి మరియు 2027 సియోల్‌లో తదుపరి సభకు ఆతిథ్యం ఇవ్వనున్న దక్షిణ కొరియా ప్రతినిధి బృందానికి పోప్ ఫ్రాన్సిస్ అభినందించారు.

"ప్రభువును నమ్మినవారు అలసట లేక పరుగెత్తుదురు" అని 39వ ​​ప్రపంచ యువజన దినోత్సవ నేపథ్యం అని పేర్కొన్నారు.

2027 ప్రపంచ యువజన దినోత్సవానికి సన్నాహకంగా కొరియాకు శిలువను తీసుకువెళనున్న ఇద్దరు కొరియన్ యువకులు  పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారి ఇరువైపులా నిలబడి ఉండగా అయన మధ్యాహన త్రికాల ప్రార్ధన చేసారు.

కొరియన్ యువత సిలువను మోసుకెళ్లడం ద్వారా ఆసియాలో వారు అందరికీ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తారని గుర్తు చేస్తూ వారిని పొప్ ప్రోత్సహించారు.

Tags