ఢాకా అగ్రపీఠ సహాయ పీఠాధిపతిగా గురుశ్రీ గోమ్స్ అభిషేకింపబడ్డారు
బంగ్లాదేశ్‌లోని రామ్నాలోని సెయింట్ మేరీస్ కేథడ్రల్‌లో ఢాకా అగ్రపీఠానికి సహాయ పీఠాధిపతిగా మే 3న, గురుశ్రీ సుబ్రొతో బోనిఫేస్ గోమ్స్ గారు అభిషేకింపబడ్డారు
ఈ కార్యక్రమానికి ఎనిమిది మంది పీఠాధిపతులు, 200 మంది గురువులు మరియు మఠకన్యలతో సహా దాదాపు 2000 మంది విశ్వాసులు హాజరయ్యారు.
బంగ్లాదేశ్ అపోస్టోలిక్ నూన్షియో మహా పూజ్య కెవిన్ రాండాల్, బంగ్లాదేశ్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి ఎండి. ఫరీదుల్ హక్ ఖాన్, కార్డినల్ మహా పూజ్య పాట్రిక్ డి'రొజారియో, CSC ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
బిషప్ గోమ్స్ దేవుని వాక్యాన్ని వ్యాప్తి చేయడానికి తన అంకితభావాన్ని వ్యక్తం చేసారు మరియు శ్రీసభలో ఐక్యత మరియు ప్రాముఖ్యతను నొక్కి వక్కాణించారు.
ఢాకా అగ్రపీఠాధిపతులు మహా పూజ్య బెజోయ్ యెన్. డి’ క్రూజ్ OMI, గారు గోమ్స్ గారు గురువుగా చేసిన ఆదర్శప్రాయమైన సేవను ప్రశంసిస్తూ, అతని పరిపాలనా మరియు మతసంబంధ నైపుణ్యాలను తెలియచేసారు.
ఢాకా అగ్రపీఠానికి నాయకత్వం వహించే ఫాదర్ గారి సామర్థ్యంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ సరళత, ప్రార్థన మరియు కరుణను మహా పూజ్య గోమ్స్ మెచ్చుకున్నారు.
విశ్వాసుల మతపరమైన అవసరాలను తీర్చడం సహాయక పీఠాధిపతి పాత్ర అని ఆయన అన్నారు.
గోమ్స్ గారు నవంబర్ 19, 1962న పుర్బపరా గ్రామంలో జన్మించారు. 1989లో గురువుగా అభిషేకింపబడ్డారు మరియు చర్చిలో వివిధ విచారణలో తన సేవలందించారు, అచంచలమైన అంకితభావం మరియు నాయకత్వాన్ని ప్రదర్శించారు.
తను సహాయక పీఠాధిపతిగా నియమించబడటానికి ముందు, విచారణ గురువుగా, కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ బంగ్లాదేశ్ (CBCB) అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా మరియు హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీకి ఆధ్యాత్మిక డైరెక్టర్‌గా పనిచేసారు