ఘనంగా ప్రపంచ వృద్ధుల దినోత్సవం

జూలై 28న  హైదరాబాద్ అగ్రపీఠం, బొల్లారం, సెయింట్ జోసఫ్ విచారణలో 4 వ  
ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని (World Grandparents and Elder Day) ఘనంగా నిర్వహించారు.

ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు 2021 సంవత్సరములో ప్రకటించారు. అప్పటినుండి  ప్రతి సంవత్సరం, జూలై నెల నాల్గవ ఆదివారము నాడు, ఈ పండుగను ప్రతి కథోలిక దేవాలయాలలో నిర్వహిస్తున్నారు. 

  
బొల్లారం విచారణ కర్తలు గురుశ్రీ వాలెంటైన్  గారి ఆధ్వర్యంలో అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు ప్రత్యేక దివ్యబలి పూజను సమర్పించి విచారణలో ఉన్న వృద్ధుల కొరకు ప్రత్యేకంగా ప్రార్ధించారు.

మన కన్నా వయసులో పెద్దవారిని మరి ముఖ్యంగా వృద్ధులను గౌరవించాలని, వారి జీవిత అనుభవాలను, సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవాలని,  పాత తరాల వారితో  మంచి  సంబంధాలను కొనసాగించడం వలన  యువత అమూల్యమైన విలువను నేర్చుకుంటారని, చక్కటి  విశ్వాస జీవితము గడపవచ్చు అని తెలిపారు. 

Tags