ఘనంగా అద్భుత బాలయేసు మహోత్సవం

infant_jesus_feast.jpg

ఘనంగా అద్భుత బాలయేసు మహోత్సవం

విశాఖ అతిమేత్రాసనం, బొబ్బిలి విచారణ, బాలయేసు నగర్ లో అద్భుత బాలయేసు మహోత్సవం ఘనంగా జరిగింది.బొబ్బిలి విచారణ కర్తలు, విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ  మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి.

 విజయనగరం డీన్ గురుశ్రీ బందనాదం జోసెఫ్ గారు ,గురుశ్రీ  జీవన్ బాబు గారు, గురుశ్రీ Rp  ప్రసాద్ గారు, గురుశ్రీ  మరియదాసు గారు, గురుశ్రీ అశోక్ గారు , గురుశ్రీ నవీన్ గార్లు ఈ పండుగలో పాల్గొన్నారు.

విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ  జీవన్ బాబు గారు ఇతర గురువులతో కలసి పవిత్ర దివ్య పూజాబాలి ని సమర్పించారు. గురుశ్రీ  జీవన్ బాబు గారు మాట్లాడుతూ "ప్రభువునకు మానవులంటే ఎంతో ప్రేమ అని , దివ్యాసప్రసాద రూపంలో మన అందరిలోకి  వస్తున్నారు" అని అన్నారు.ఎల్లపుడు మనము ఆయనను ఆరాధించాలి అని కోరారు. దివ్యపూజాబాలిలో  చిన్నారులు నూతన దివ్య సప్రసాదం  స్వీకరించారు.

అనంతరం గురుశ్రీ  జీవన్ బాబు గారు బాలయేసుని ఉయ్యాలలో  ప్రతిష్టించారు. పిల్లలు లేని భార్య భర్తలు  ఆ బాలయేసుని ఆరాధించి , ఉయ్యాలను ఊపుతూ బాల యేసుని చెవుల్లో తమ కోరికలను ప్రార్థన రూపంలో తెలియజేసారు.

సహాయక గురువులు గురుశ్రీ బెంజిమన్  గారు తన సహాయ సహకారాలను అందించారు. అధికసంఖ్యలో విచారణ ప్రజలు ,యువతీ యువకులు పాల్గొన్నారు. విచారణ గాయక బృందం ప్రభు యేసుని స్మరిస్తూ మధురమైన గానాలను ఆలపించారు.     

పండగకు సహకరించిన  ప్రతి ఒక్కరికి విచారణ గురువులు గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్ గారు  ధన్యవాదాలు  తెలిపారు. ముఖ్యంగా ఉపదేసులు అందికీ  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.