ఉక్రెయిన్‌కు వాటికన్ సహాయం

ఉక్రెయిన్‌కు వాటికన్ సహాయం

ఉక్రెయిన్‌కు వాటికన్ సహాయం 

ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా బాధపడుతున్న ప్రజలకు సహాయం అందించేందుకు వాటికన్ ప్రత్యేక మానవతా సహాయ కార్యక్రమాన్ని నిర్వహించింది. చలికాలం సమీపిస్తున్న నేపథ్యంలో, బాధితులకు అవసరమైన దుస్తులు, దుప్పట్లు, ఆహారం తదితర వస్తువులను సేకరించారు. 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాటికన్ దాతృత్వ విభాగం అధిపతి అగ్రపీఠాధిపతులు  మహా పూజ్య లూయిస్ మారిన్ డి శాన్ మార్టిన్ గారు మాట్లాడుతూ, ఈ సహాయం “శ్రీసభ కి ఒక అందమైన సాక్ష్యం” (A beautiful witness of the Church) అని అభివర్ణించారు. 

చలికాలం సమీపిస్తున్నందున వెచ్చని దుస్తులు, దుప్పట్లు, ఆహారం వంటి వస్తువుల అవసరం మరింత పెరుగుతుంది.ఈ పరిస్థితుల్లో వాటికన్ అందిస్తున్న సహాయం బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగించడమే కాకుండా, వారు ఒంటరిగా లేరనే భరోసాను కూడా ఇస్తుంది.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, అక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా హోలీ సీ సహాయాన్ని అందిస్తూనే ఉంది.  వాటికన్ సహాయం దుస్తులు, ఆహార వస్తువులకే పరిమితం కాలేదు.ఇటీవలి వారాల్లో ఇటలీకి చెందిన ఔషధ సహాయ సంస్థ Banco Farmaceutico ద్వారా సుమారు 2 కోట్ల యూరోల విలువైన మందులను నాలుగు ట్రక్కులలో ఉక్రెయిన్‌కు పంపించారు.

మహా పూజ్య  మారిన్ డి శాన్ మార్టిన్ గారు ఉక్రెయిన్ పర్యటనకు ముందు ఈ విరాళాల సేకరణను నిర్వహించారు. అక్టోబర్ 27న ప్రారంభమయ్యే ఈ మూడు రోజుల పర్యటనలో, డికాస్టరీ అండర్ సెక్రటరీ అయిన మాసిమో రాలీ ఆయనతో పాటు ఉంటారు. 

దాదాపు ఐదేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం యొక్క ప్రభావాలను ఎదుర్కొంటున్న ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు ఈ పర్యటన ఉద్దేశించబడింది. ఈ మిషన్‌లో ఉక్రేనియన్ గ్రీక్ కాథలిక్ చర్చ్ మరియు లాటిన్-రైట్ కాథలిక్ చర్చ్ కూడా పాలుపంచుకుంటున్నాయి.

 

Article and Design By M Kranthi Swaroop

Telugu Survey Popup Image