ఆశ ఎప్పుడూ నిరాశపరచదు: న్యాయం మరియు సంఘీభావం కొరకు పిలుపునిచ్చిన పోప్ ఫ్రాన్సిస్
యుద్ధం, స్థానభ్రంశం, కరువు మరియు మానవతా సంక్షోభాలు ప్రస్తుత సమయంలో ప్రపంచ సవాళ్లను గురించి పరిశుద్ధ పొప్ ఫ్రాన్సిస్ గారి పుస్తకం" హోప్ నెవర్ డిసప్పాయింట్: పిల్గ్రిమ్స్ టువర్డ్స్ ఎ బెటర్ వరల్డ్ " లో ప్రస్తావించారు.
జూబ్లీ 2025 కోసం ఆధ్యాత్మిక మరియు నైతిక మార్గదర్శిగా వ్రాసిన ఈ పుస్తకం ఇటలీ, స్పెయిన్ మరియు లాటిన్ అమెరికాలో మంగళవారం, నవంబర్ 19న విడుదల చేయబడింది. తదుపరి నెలల్లో ప్రపంచవ్యాప్త పంపిణీకి సిద్ధమవుతుంది.
ఈ పుస్తకంలో గాజాలో కొనసాగుతున్న మానవతావాద సంక్షోభం కీలకాంశం.
న్యాయం, జవాబుదారీతనం మరియు లక్షలాది మంది అనుభవిస్తున్న బాధల గురించి లోతైన అవగాహన అవసరమని ఆయన నొక్కి వక్కాణించారు .
పోప్ ఫ్రాన్సిస్ గారు గాజాలో పరిస్థితిపై లోతైన దర్యాప్తు కొరకు పిలుపునిచ్చారు, అక్కడి పరిస్థితులు మారణహోమం యొక్క లక్షణాలను కలిగి ఉన్నాయనే వాదనలను అంగీకరిస్తున్నారు.
"కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, గాజాలో జరుగుతున్నది మారణహోమం లక్షణాలను కలిగి ఉంది.
న్యాయనిపుణులు మరియు అంతర్జాతీయ సంస్థలు రూపొందించిన సాంకేతిక నిర్వచనానికి ఇది సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి ఇది జాగ్రత్తగా పరిశోధించబడాలి" అని ఆయన రాశారు.
Hernán Reyes Alcaide మరియు Edizioni Piemme ప్రచురించిన ఈ పుస్తకం, ప్రతి ఒక్కరి గౌరవాన్ని,సంఘీభావం మరియు కరుణ ద్వారా బలహీనుల బాధలను పరిష్కరించాల్సిన అవసరాన్ని చెబుతుంది.
న్యాయం, కరుణ, ప్రపంచ ఐక్యత పట్ల నూతన నిబద్ధతను, సునాదకాల స్ఫూర్తిని పెంపొందింపజేయాలని, ఇది సయోధ్య, పునరుద్ధరణ, నిరీక్షణకు సమయం అని పొప్ గారు అన్నారు.