ఆదర్శ్ నగర్ లెప్రసి కాలనీని సందర్శించిన కర్నూలు పీఠకాపరి

కర్నూలు పీఠం, ఆదర్శ్ నగర్ లెప్రసి కాలనీని కర్నూలు పీఠకాపరి మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారు సందర్శించారు.

పీఠాధిపతుల వారు ఆదర్శ్ నగర్ లోని లెప్రసి రోగుల కుటుంబాలకు క్రిస్మస్ కానుకలు అందచేసి, వారి కొరకు ప్రత్యేక ప్రార్ధనలు చేసారు.

కర్నూలు మేత్రాసన సాంఘీక సేవ సంస్థ డైరెక్టర్ గురుశ్రీ సనికే సుధాకర్ (భాస్కర్) గారు ఈ కుటుంబాలకు ప్రేమ విందును కూడా ఏర్పాటు చేశారు