ప్రపంచ చలనచిత్ర సభ్యులతో సమావేశమైన పోప్ లియో

శనివారం నవంబర్ 15 రోజున ప్రపంచ చలనచిత్ర సభ్యులైన నటులు, చిత్రకారులు, దర్శకులు, రచయితలుతో పోప్ లియో వాటికన్‌ అపోస్తోలిక్ ప్యాలెస్‌లో సమావేశమైయ్యారు 

ఈ సభ్యులంతా ప్రస్తుత ప్రపంచానికి “ఆశ, అందం, సత్యానికి సాక్షులు”గా నిలవాలని పోప్ అన్నారు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ రంగ ప్రతినిధులు ఈ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. 

1895లో సినిమా తొలి పబ్లిక్ స్క్రీనింగ్‌కి దాదాపు 130 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంలో, సినిమా ప్రాధాన్యాతను పోప్ ప్రత్యేకంగా ఉద్ఘాటించారు. 

కేవలం విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి నుండి, జీవిత సహసంబంధమైన విషయాలని గ్రహించేందుకు, తన సహజ బలహీనతను అర్థం చేసుకోవడానికి, మనసులో ఉండే కోరికను వ్యక్తం చేసేందుకు సినీ కళ మనుషులకు సహాయపడుతుందని పేర్కొన్నారు.

చలన చిత్రాలు కేవలం వినోదం కాదు, ఒక మనిషి ఆత్మయాత్రను ప్రతిబింబించే కథనమని పోప్ చెప్పారు. 

జూబిలీ సంవత్సరాన్ని ప్రస్తావిస్తూ, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సినీ కళాకారులు నిరీక్షణా సంకేతమని తెలిపారు. జ్ఞాపకాలు, భావాలు, చిత్రాలు — ఇవే నిజమైన యాత్రికులను నిర్మిస్తాయని వివరించారు. అందుకే వారిని "నిరీక్షణా యాత్రికులు (pilgrims of hope)”గా అభివర్ణించారు.

చలనచిత్రనిర్మాణం ఒక సహకార ప్రక్రియ అని, అందులో పనిచేసే ప్రతి ఒక్కరి పాత్ర అమూల్యమని కూడా ఆయన గుర్తుచేశారు.

సమావేశం ముగింపులో కళాకారులు పోప్‌ను పలకరించారు.